Wednesday, May 8, 2024
- Advertisement -

పోలింగ్ మొద‌లు కాకముందే వైసీపీ విజ‌యం..

- Advertisement -

ఏపీ ఎన్నిక‌లు వైసీపీ, టీడీపీకీ జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారింది. రెండు పార్టీలు అధికారంకోసం ఎన్నిక‌ల స‌మ‌రాన్ని కొన‌సాగిస్తున్నాయి. ఎత్తులు…పైఎత్తుల‌తో ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నిక‌లు అనుకూలంగా ఉంటాయ‌న‌డంలో సందేహంలేదు. ఎంకంటె పోలీస్ విభాగంతో స‌హా అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను మ్యానేజ్ చెసె శ‌క్తి ఉంటుంది. పోల్ మేనేజ్ మెంట్ చేయ‌డంలో చంద్ర‌బాబును మించిన మొన‌గాడు ఉండ‌రు. ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో అధికారాన్ని ఉప‌యోగించుకొని ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లపై ఏసులు పెట్ట‌డం వారిని భ‌య‌బ్రాంతుల‌కు గురి చేయ‌డం సాగుతోంది.

ఇద‌లా ఉంటె మొద‌టి నుంచి వైసీపీ బాబుపై ఆరోప‌న‌లు చేస్తూనె ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుతోపాటు శ్రీ‌కాకుళం, క‌డ‌ప ఎస్పీల‌లు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నార‌ని ఇప్ప‌టికే అనేక సార్లు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత స్థానిక పోలీసులతో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పదే పదే ఫోన్‌లో మాట్లాడారని ఆరోపించారు. తన ముందే కడప ఎస్పీకి పలుమార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని వెల్లడించారు. తమ బాబాయ్ హత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఫిర్యాదు మేర‌కు ఎన్నిక‌ల సంఘం వారిపై ఎన్నిక‌ల విధుల‌నుంచి వేటు వేసింది.

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఈసీ. ఆయనతో పాటు కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను సైతం బదీలీ చేసింది. ముగ్గురు అధికారులు ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. వీరికి ఎలాంటి ఎన్నిక‌ల విధులు నిర్వ‌ర్తించ వ‌ద్ద‌ని ఆదేశాల్లో తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -