Thursday, May 9, 2024
- Advertisement -

ఎపిలో ఆ ఏడు జిల్లాల్లో ఉన్న ‘వాళ్ళు’ మనుషులే కాదు… పశువులు: చంద్రబాబు

- Advertisement -

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ అహంకారం పెరిగిందే లేక వయసు ప్రభావమో కానీ బాబు నాలుక అదుపు తప్పుతోంది. ముఖ్యమంత్రి స్థాయిని మరిచిపోయి దిగజారుడు మాటలు చాలానే మాట్లాడేస్తున్నాడు చంద్రబాబు. ఇప్పుడు మరోసారి తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోని కొందరు మనుషులను ‘పశువులు’ అనేశాడు చంద్రబాబు. ఆ మధ్య ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఆడబిడ్డలను అవమానించేలా మాట్లాడాడు. మరోసారి దళితుల విషయంలో నోరుజారి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశాడు. ఇక ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆ మనుషులుందరూ పశువుల అని దారుణమైన వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు.

ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌లాంటి పెద్ద పెద్ద విషయాల్లో ఏమీ చేయలేకపోతున్న విషయం ప్రజలకు అర్థం కాకుండా ఉండడం కోసం, 24/7 కష్టపడుతున్నాను అని ప్రజలను నమ్మించడం కోసం ప్రతి రోజూ కూడా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ ఉంటాడు చంద్రబాబు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఆంద్రప్రదేశ్ ప్రజల కోసం ఏదో చేస్తున్నానన్న కలరింగ్ ఇవ్వడం కోసం ప్రచార పాట్లు పడుతూ ఉంటాడు. నిజంగా అభివృద్ధి చేసేవాళ్ళెవ్వరూ ఇలాంటి పబ్లిసిటీ చేయరు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్‌తో దేశంలో ఏ ఇతర ముఖ్యమంత్రీ కూడా చంద్రబాబు స్థాయిలో పబ్లిసిటీ స్టంట్స్ చేయరు. అభివృద్ధి పనులు చేస్తూ ఉంటారు. కానీ బాబు మాత్రం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వ్యవస్థాగతంగా గుర్తించదగ్గర అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా చేసింది లేదు. ఆ విషయం ప్రజలకు తెలియకుండా ప్రతి రోజు మీడియా ముందు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ ఉంటాడు. తాజాగా అలాంటి ఒక పబ్లిసిటీ స్టంట్ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ ప్రజలను అవమానించేలా మాట్లాడాడు చంద్రబాబు.

ఆంద్రప్రదేశ్‌లో ఆరు జిల్లాల్లో వంద శాతం మరుగుదొడ్లను నిర్మించానని చెప్పుకున్నాడు చంద్రబాబు. అది ఎంత వరకూ నిజమో ఆయనకే తెలియాలి. గ్రౌండ్ రిపోర్ట్స్ మాత్రం వేరేలా ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడిన మాటలు మాత్రం పూర్తిగా అభ్యంతరకరం. ‘మరుగుదొడ్డి వాడకుంటే మనుషులు కాదు…….పశువులతో సమానం’ అని పరుషంగా మాట్లాడాడు చంద్రబాబు. ఈ మాటలు కచ్చితంగా ఆక్షేపణీయమే. కోట్లాది రూపాయల ప్రజా సొమ్ముతో భారీ భవంతులు నిర్మించుకునే పాలకులకు ప్రాథమిక స్థాయిలో ప్రజల కష్టాలు మాత్రం అస్సలు తెలియడం లేదు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో కొన్ని లక్షల మంది బ్రతుకుతున్నారు. వాళ్ళకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా ఉండదు. మరుగుదొడ్ల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. మరి బాబుగారు చెప్పినట్టుగా వాళ్ళందరూ పశువులేనా? ఇక చంద్రబాబే చెప్పినట్టుగా ఆరు జిల్లాల్లో మాత్రమే వంద శాతం మరుగుదొడ్లు నిర్మించారట. మరి మిగతా ఏడు జిల్లాల్లో ఉన్న మనుషులు మనుషులు కాదా? మరుగుదొడ్లు నిర్మిస్తాం, బహరింగ మల విసర్జన కరెక్ట్ కాదు అని చెప్పి ఉంటే బాబును ఎవరూ తప్పు పట్టేవాళ్ళు కాదు. కానీ ‘మరుగుదొడ్డి వాడకుంటే మనుషులే కాదు……పశువులు’ అని మాట్లాడడం మాత్రం అహంకారంతో అమానవీయంగా, పరుషంగా మాట్లాడడమే అని కచ్చితంగా చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -