Friday, May 10, 2024
- Advertisement -

బాబు అడ్డాలో జగన్‌కి బ్రహ్మరథం…. పులివెందులలో బాబుకు ఆ స్పందన్ వస్తుందా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న ఇద్దరు నాయకులు చంద్రబాబు, జగన్‌లు. పవన్‌తో సహా మిగిలిన నాయకులందరిదీ కూడా సహాయ బృందం పాత్రే. అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబు ఈ రోజు వైఎస్‌ల కంచుకోట అయిన పులివెందులలో పర్యటించబోతున్నాడు. ఇక వైఎస్ జగన్ కూడా చంద్రబాబు అడ్డాలో తన సంకల్పయాత్రను కొనసాగిస్తున్నాడు. పోల్ మేనేజ్‌మెంట్, రాజకీయ వ్యూహాల విషయంలో 2014 ఎన్నికలకు ముందు నుంచీ ఇప్పటి వరకూ కూడా జగన్‌పై చంద్రబాబుదే పై చేయి. సోనియాతో కుమ్మక్కయ్యాడని, పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తాడని, విభజనకు సహకరించాడని చెప్పి జగన్‌పై బాబు చేసిన అబద్ధపు ప్రచారాలన్నీ కూడా ఓటర్లు నమ్మారు. బాబు అబద్ధపు హామీల గురించి మాత్రం ఓటర్లను నమ్మించలేకపోయాడు జగన్. 2014లో బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ చూసుకుంటే బాబు హామీలు, అధికారంలోకి రావడం కోసం చేసిన కుట్రల గురించి జగన్ చెప్పిన ప్రతిమాటా నిజమైంది. కానీ జగన్ గురించి బాబు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధాలే అన్న విషయం రుజువయింది. తెలంగాణాతో పాటు ఆంద్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్‌-తెలుగుదేశం తెరవెనుక పొత్తు వ్యవహారాల గురించి రాజకీయ విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. ఆ రకంగా చూస్తే రాజకీయ వ్యూహాలు, ప్రచార వ్యవహారాలతో ఓటర్లను నమ్మించడం, పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో జగన్‌పై చంద్రబాబుదే పై చేయి.

అయితే ప్రజాదరణ విషయంలో మాత్రం చంద్రబాబు కంటే ఎన్నో రెట్లు పైనున్నాడు జగన్. మీడియా మొత్తం బాబు గురించి ప్రచారం చేస్తున్నా, బాబు పర్యటనలకు ఫుల్ కవరేజ్ ఇస్తున్న చంద్రబాబు సభలకు ఎప్పుడూ కూడా అంతంత మాత్రం స్పందనే వస్తూ ఉంటుంది. అదే సమయంలో జగన్‌ పర్యటనలకు మాత్రం బ్రహ్మరథం పడుతూ ఉంటారు ప్రజలు. గత కొన్ని రోజులుగా ముఫ్పైఏళ్ళకు పైగా చంద్రబాబుకు అడ్డాగా ఉన్న ప్రాంతంలో జగన్ సంకల్పయాత్ర కొనసాగుతుంది. జగన్‌కి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఇక ఈ రోజు చంద్రబాబు పులివెందులలో పర్యటించబోతున్నాడు. దశాబ్ధాలుగా వైఎస్‌లకు అడ్డా అయిన పులివెందులలో బాబుకు ఎలాంటి స్పందన వస్తుందా అన్న ఆసక్తి రాజకీయాలను అనుసరిస్తున్న వాళ్ళలో కనిపిస్తోంది. డ్వాక్రా మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా అందరూ కూడా బాబు సభల కోసం ప్రజలను తరలించే పనిలో ఉన్నారు. బాబు మీడియా కూడా బాగానే కష్టపడుతోంది. మరి ప్రతిపక్ష నాయకుడు జగన్‌కి వస్తున్న ప్రజాదరణ స్థాయిలో కాకపోయినా పులివెందలు బాబుకు గౌరవపాటి ప్రజా స్పందన ఉంటుందా? రాజకీయ వ్యూహాలు, పోల్ మేనేజ్‌మెంట్, ప్రచార వ్యవహారాల్లో జగన్‌పై పైచేయి సాధిస్తున్న చంద్రబాబు ప్రజాదరణ విషయంలో కూడా జగన్‌తో పోటీపడగలడా? వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాయిలో ప్రజాదరణను ఎప్పుడూ పొందలేకపోయిన చంద్రబాబు…ఆ విషయంలో జగన్‌ని అయినా మించగలడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -