Thursday, May 2, 2024
- Advertisement -

టీడీపీ నేత‌ల్లో తీవ్ర ఆందోళ‌న‌..

- Advertisement -

వ‌చ్చె సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌ని నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు చంద్ర‌బాబు. ఎన్నిక‌ల స‌మ‌యానికి పార్టీలో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. అనేక సార్లు పార్టీ ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌ర్వే చేయించారు బాబు. అయితే స‌ర్వేలో న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో బాబు ముంద‌స్తు చ‌ర్య‌ల‌కు పూనుకున్నారు. స‌ర్వేల ఫ‌లితాలు చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా రావ‌డంతో వారిలో ఆందోళ‌న మొద‌ల‌య్యింది.

కొద్ది రోజులుగా నియోజకవర్గాల వారీగా చేయిస్తున్న సర్వేల ఆధారంగా ఎవరెవరికి టిక్కెట్లను నిరాకరించాలో కుడా చంద్రబాబు నిర్ణయించేసారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. పనితీరు బాగోలేకపోవటం, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం తదితర అంశాల ప్రాతిపదికగా చంద్రబాబు సర్వేలు చేయిస్తున్నారు.

కొద్ది రోజులుగా చంద్రబాబు తరచూ ముందస్తు ఎన్నికల గురిచి ప్రవచిస్తున్నారు. అందులో భాగంగానే సర్వేల జోరు కుడా పెంచారట. సోమ, మంగళవారాల్లో జరిగిన పార్టీ నేతల సమావేశాల్లో కుడా 2018 చివరి నాటికే ఎన్నికలు వస్తాయని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో ఎవరిని పక్కకు పెట్టాలి, ఎవరికి టిక్కట్లు ఇవ్వాలన్న విషయంలో చంద్రబాబు నిర్ణయానికి వచ్చారట. మొత్తం మీద సుమారు 30 మందికి టిక్కెట్లు దక్కే అవకాశం లేదని ప్రచారం ఊపందుకున్నది. దానికితోడు జనసేన, భారతీయ జనతా పార్టీలతో గనుక పొత్తులుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

భాజపా, జనసేనతో పొత్తులుంటే వారికి కొన్ని సీట్లను కేటాయించాలి కదా? కాబట్టి మరికొందరు ఎంఎల్ఏలకు పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ లెక్కన సుమారు 50 మంది ఎంఎల్ఏలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోయినా ఆశ్చర్యం లేదని సమాచారం. ఇదే ప‌రిస్థితి ఎంపీ సీట్ల‌కు కూడా వ‌ర్తిస్తుందా. మ‌రి టికెట్ రాని వారి ప‌రిస్థి ఏంటో మున్ముందు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -