Friday, April 26, 2024
- Advertisement -

అలా చేస్తే ఏపీ శ్రీలంక అవుతుందా… : జగన్

- Advertisement -

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అపేందుకు కొందరు కుట్ర చేస్తున్నారంటూ ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. ప్రజలు సంతోషంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకే ఇదంతా చేస్తున్నారన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నిధులను విడుదల చేసిన సీఎం జగన్ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే.. ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారుతుందా అంటూ ప్రశ్నించారు.

అలా కాకుండా జనం సొమ్ము జేబుల్లో వేసుకుంటే అమెరికా అవుతుందా అని ప్రశ్నించారు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోందంటూ ప్రతిపక్షాలు గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్నాయి. చైనా నుంచి భారీగా అప్పులు తెచ్చుకున్న శ్రీలంక ప్రస్తుతం దివాళా తీసే పరిస్థితిలో ఉంది. పరిస్థితులు ప్రభుత్వం చేయి దాటిపోవడంతో అక్కడ ద్రవ్యోల్బణం అమాంతంగా పెరిగిపోయింది.

లీటరు పెట్రోల్ 400 రూపాయలకు చేరిందంటే పరిస్థితి అర్థమవుతుంది. అప్పులపై అప్పులు చేస్తున్న ఏపీ సర్కార్ లో కూడా ఇదే పరిస్థితి తలెత్తుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనకు సీఎం జగన్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. ప్రజలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రేవంత్ వార్నింగ్

ఉచితాలు కొంప ముంచుతాయ్

సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -