Saturday, April 20, 2024
- Advertisement -

జులైలో వీలుకాకపోతే పరీక్షలు కష్టమే : ఏపీ మంత్రి ఆదిమూలపు

- Advertisement -

దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ సడలింపు చేస్తున్న విషయం తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపిలో గత కొన్ని రోజులుగా పది, ఇంటర్ పరీక్షల విషయంలో తర్జన భర్జన జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని, క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

జులై మాసంలో ఇంటర్ పరీక్షలు.. చివరి వారంలో టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ జులై మాసంలో పరీక్షలు నిర్వహించలేక పోయినట్లయితే.. ఇక అవకాశం ఉండదని భావిస్తున్నామని మంత్రి ఆదిమూలపు వ్యాఖ్యానించారు. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ జులైలోనే పరీక్షలు పెడతామని చెప్పడంలేదని, అవకాశం ఉందని మాత్రమే చెబుతున్నామని వివరించారు.

అప్పటికి కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వస్తే పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే పరీక్షలు రద్దు చేయడం పెద్ద విషయం కాదని.. ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం అని.. కాకపోతే విద్యార్థుల భవిష్యత్ గురించి సీఎం జగన్ అనుక్షణం ఆలోచిస్తున్నారని అన్నారు. కేరళ, బీహార్ రాష్ట్రాలు విద్యార్థులకు పరీక్షలు జరిపాయని, చత్తీస్ గఢ్ కూడా పరీక్షలు జరుపుతోందని వెల్లడించారు. చదువు.. విద్యార్థుల ఆరోగ్యం అన్నీ పరిగణలోకి తీసుకొని సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

పార్టీలో డ్రగ్స్… నటి అరెస్ట్.. ఎవరంటే?

కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కణ

బుల్లితెరపై తమన్నా.. ఏ షోకో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -