Saturday, April 20, 2024
- Advertisement -

సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్ర‌భుత్వం

- Advertisement -

పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన షెడ్యూల్‌ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన‌ తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న వేళ‌ ఎన్నికలు నిర్వహించడం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే అవుతుందని పిటిషన్‌లో పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వ‌హించ‌డం సరికాదంటూ తాము లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా తిరస్కరించిందని తెలిపింది. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఎస్ఈసీ ప‌ట్టించుకోలేద‌ని వివ‌రిస్తూ.. హైకోర్టు తీర్పును రద్దు చేయాల‌ని కోరింది.

ఇక ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ తన హయాంలోనే ఎన్నికలు నిర్వహించాలన్న ఏకైక ఉద్దేశంతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారని ఆరోపించింది. క‌రోనా స‌మ‌యంలో ఓటు వేసేందుకు వ‌స్తే వ్యాప్తి పెరిగి ప్ర‌జ‌లు ఇబ్బందుల పాల‌వుతార‌నే విష‌యాల‌ను పరిగణలోకి తీసుకోవడంలో హైకోర్టు విఫలమైందని తెలిపింది. మ‌రి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో చూ‌డాలి!

బీజేపీ, టీఆఆర్‌ఎస్‌ మధ్య తోపులాట.. మండిపడ్డ సంజయ్

అమ్మ పాత్రల్లో నటించే వీరి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

అడిగితే బాలయ్యకు ఆ పదవి ఇవ్వొచ్చు.. నాని

ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్ కు కీల‌క ఆట‌గాడు దూరం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -