Monday, May 6, 2024
- Advertisement -

గంగుల ప్ర‌తాప్‌రెడ్డి చేరిక వైసీపీకంటె టీడీపీకె న‌స్టం ఎక్కువ‌…..

- Advertisement -

ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మారుతాయొ ఎవ‌రికి అంతుప‌ట్ట‌డంలేదు. ఎవ‌రు ఏ పార్టీలో వ‌ల‌స వెల్తారొ అర్థంకాని ప‌రిస్థితి. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక‌ల వేల అఖిల‌ప్రియ‌కు చంద్ర‌బాబు భారీ షాక్ ఇవ్వ‌బోతున్నార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.అదే జ‌రిగితె భ‌విష్య‌త్తులో భూమా వ‌ర్గానికి ఇబ్బందే.

మాజీ మంత్రి గంగుల ప్ర‌తాప్ రెడ్డి టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైపోవడంతో వైసీపీ కంటె అందరి కన్నా ఎక్కువగా మంత్రి అఖిలప్రియనే ఇబ్బంది పెడుతోందన్న వాదన వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్‌ను ప్రతాప్ రెడ్డికి చంద్రబాబు ఆఫర్ చేయడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ అఖిలప్రియ ప్రత్యర్థి వర్గం ఇప్పుడీ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది.

నంద్యాల ఉపఎన్నికలో అధినేత చంద్రబాబు తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిలో ఉన్న అఖిలప్రియకు ఇప్పుడీ విషయం ఏమాత్రం మింగుడుపడటం లేదని ప్రచారం సాగుతోంది. ప్రతాప్ రెడ్డి చేరిక విషయం గురించి తనకు మాట మాత్రమైన సమాచారం ఇవ్వకపోవడం అఖిలప్రియను బాధించిందని చెబుతున్నారు. ప్ర‌తాప్ రెడ్డి వర్గాన్ని పార్టీలో చేర్చుకోవడం అఖిలప్రియకు మింగుడుపడటం లేదట. మున్ముందు వీరంతా కలిసి తన స్థానానికి ఎక్కడ చెక్ పెడుతారోనన్న ఆందోళనలో ఆమె ఉన్నట్లు ప్రత్యర్థి వర్గం చెబుతోంది.

ఇప్పుడు ప్రతాప్ రెడ్డి తన రాజకీయ ఉనికి కోసం తెలుగుదేశంలోకి చేరుతున్నాడట.. అప్పుడెప్పుడో గంగుల సోదరులు టీడీపీలో చేరినట్టు గుర్తు. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి వైసీపీలోకి వెళ్లిపోయాడు. ప్రతాప్ రెడ్డి టీడీపీలోనే మిగిలినట్టు లెక్క. ఇక్క‌డ వైసీపీ కంటె టీడీపీకె న‌ష్టం. ఆళ్లగడ్డ నియోజకవర్గం వరకూ గంగుల, భూమా కుటుంబాలకు ఉన్న వైరం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో గంగుల ప్రతాప రెడ్డి తెలుగుదేశం లోకి చేరడం లేదా చేరుతుండటం పట్ల అఖిల ఫైర్ అవుతోందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -