Wednesday, May 8, 2024
- Advertisement -

పాపం.. దురదృష్టం అంటే నీదే కుల్దీప్‌!

- Advertisement -

గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంతైనా అదృష్టం ఉండాలంటారు. టీమిండియా బౌల‌ర్ కుల్దీప్ ప్ర‌స్తుత ప‌రిస్థితికి ఈ నానుడి స‌రిగ్గా స‌రిపోతుంది. అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో సిడ్నీలో జ‌రిగిన మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్్స‌లో ఐదు వికెట్లు తీసి అంద‌రి చూపును త‌న‌వైపుకు తిప్పుకున్నాడు ఈ చైనామ‌న్ స్పిన్న‌ర్‌. టెస్టుల్లో యువ ఆట‌గాళ్ల‌లో మొద‌టి చాయిస్ అంటే అత‌డే అన్నంత‌గా ప్ర‌శంస‌లు అందుకున్నాడు. కానీ తొంద‌ర్లోనే సీన్ రివ‌ర్్స అయింది.

గ‌త 13 టెస్టుల ప్రాబ‌బుల్్స జ‌ట్టులో అత‌డి పేరు ఉన్న‌ప్ప‌టికీ తుది జ‌ట్టులో మాత్రం చోటు ద‌క్క‌లేదు. ఇటీవ‌లి ఆసీస్ టూర్‌లో యువ ఆట‌గాళ్లు సిరాజ్‌, వ‌శీ, సైనీ, న‌ట‌రాజ‌న్ వంటి యంగ్ క్రికెట‌ర్లు ఆడేఎట్ట‌కేల‌కు స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌రుగ‌నున్న 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనైనా ఆడే అవ‌కాశం వ‌స్తుంద‌ని ఆశ‌గా ఎదురు చూశాడు కుల్దీప్‌. ఆశించిన‌ట్టుగానే తొలి రెండు టెస్టు ప్రాబ‌బుల్ జ‌ట్టులో ఉన్నా, . శుక్ర‌వారం నాటి మొద‌టి మ్యాచ్‌లో మాత్రం చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. ముగ్గురు స్పిన్న‌ర్ల‌తో భార‌త జ‌ట్టు బ‌రిలోకి దిగుతుండ‌టంతో కుల్దీప్‌కు స్థానం ల‌భిస్తుంద‌ని భావించినా నిరాశే ఎదురైంది.

ఆఖ‌రి నిమిషంలో అక్ష‌ర్ ప‌టేల్ గాయ‌ప‌డ‌టంతో అత‌డి స్థానంలో న‌దీంను జ‌ట్టులోకి తీసుకోవ‌డంతో కుల్దీప్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్ల‌యింది. ఈ నేప‌థ్యంలో మాజీ దిగ్గ‌జాలు గౌతం గంభీర్‌, మ‌హ్మద్ కైఫ్ టీమిండియా మేనేజ్‌మెంట్ తీరును త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌తిభ ఉన్న కుల్దీప్‌ను జ‌ట్టులోకి తీసుకోక‌పోవ‌డం ఏమిట‌ని విమ‌ర్శించారు. అదే విధంగా అవ‌కాశం వ‌చ్చేంత వ‌రకు ఓపిక‌గా ఎదురుచూడాల‌ని, అప్ప‌టి వ‌ర‌కు ధైర్యంగా ఉండాల‌ని కుల్దీప్‌కు అండ‌గా నిలిచారు.

సెంచ‌రీ చేసిన రూట్‌.. స్కోరు ఎంతంటే!

ఈ 28 మంది వలన ఏమి లాభం: లోకేష్

పసుపు తో ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు!

బాలయ్యతో ‘క్రాక్’ డైరెక్టర్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -