చంద్ర‌బాబుది దొంగ దీక్ష

- Advertisement -

ఏపీలో రాజకీయం హీటెక్కిస్తోంది.. డ్రగ్స్ కేసుకు సంబంధించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సీఎం వైయస్ జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు… వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడి.. పట్టాభి అరెస్ట్‌.. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో చంద్రబాబు 36 గంటల పాటు దీక్ష చెప్పటారు. మరోవైపు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా “జనాగ్రహ దీక్ష” లకు పిలుపు నిచ్చింది.

చంద్రబాబు జీవితమంతా కుట్రల మయమని ఆం‍ధ్రప్రదేశ్‌ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి బూతులు మాట్లాడారని అన్నారు. చంద్రబాబు దీక్ష అంటేనే ఒక దొంగ దీక్ష… అని మంత్రి బాలినేని విమర్శించారు.

- Advertisement -

ఏపీలో కుట్రలో కుతంత్రాలు చేస్తామంటే ఊరుకోబోమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పట్టాభి అసభ్య పదజాలాన్ని చంద్రబాబు వెనకేసుకోస్తారా? అని ప్రశ్నించారు. గతంలో.. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి టీడీపీ నేతలు రథాలు తగలబెట్టించారని బాలినేని ఎద్దేవా చేశారు.

పట్టాభినే కాదు.. చంద్రబాబును కూడా అరెస్టు చేయాలి

ప్రభాస్ ను ఢీ కొట్టనున్న పృథ్వీరాజ్..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -