Friday, March 29, 2024
- Advertisement -

ఐపీఎస్ అధికారులకు ‘బండి’ వార్నింగ్

- Advertisement -

రాష్ట్రంలో బీజేపీ నేతలపై ఇటీవల దాడులు జరుగుతండదాన్ని ఆపార్టీ సీరియస్ గా తీసుకుంటుంది. గతంలో బీజేపీ రాష్గ్ర అధ్యక్షుడు కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ తన కార్యాలయంలో దీక్షకు దిగగా అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీనిపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ స్పందించింది.

సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 3 వతేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఆర్మూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు.

తమ పార్టీ నేతలపై దాడులకు పోలీసు ఉన్నతాధికారులు సహరిస్తున్నారని, కేంద్రంలో ఉన్నది తమ ప్రభుత్వమే అని ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారులు గుర్తించాలని అన్నారు. తెలంగాణలో రానున్నది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఎంపీ అర్వింద్ పై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసును నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.

Also Read: ఇక మత్తు వదలాల్సిందే.. సర్కారు కీలక నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -