Sunday, April 28, 2024
- Advertisement -

టీడీపీ త‌రుపున ప్ర‌చారాన్ని గాలికొదిలేసిన నాయ‌కులు…

- Advertisement -

ఎన్నికల్లో నెగ్గుకురావడమంటే అంత ఆషామాషీ వ్యవహారమేమి కాదు. మనీతో మేనేజ్ చేయాలనుకోవడం అన్నిసార్లు కుదరకపోవచ్చు. జనం ముందు స్ట్రాంగ్ పర్సనాలిటీని నిలుచోబెడితే తప్ప కనీసం సభలు, సమావేశాలకైనా చెప్పుకోదగ్గ రీతిలో జనం రారు. ఇప్పుడు ఇదే సీన్ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో చోటు చేసుకుంటోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిల్పా మోహన్ రెడ్డిని సర్వశక్తులూ ఒడ్డి గెలిపించుకోవడానికి ఇవాళ వైఎస్ జగన్మోహన రెడ్డి నంద్యాల ప్రచారబరిలో అడుగుపెడుతున్నారు. తను నిర్వహించిన బహిరంగ సభలోనే ప్రచారం ముగిసేవరకు ఇక్కడే ఉంటానన్న జగన్ ఈనెల 21దాకా నంద్యాల నుంచి వెళ్లకుండా.. ప్రచారాన్ని ముందుండి న‌డిపించ‌నున్నారు.

చంద్రబాబునాయుడు.. నంద్యాలలో తాను నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమమే ప్రచార కార్యక్రమం కూడా అన్నట్లుగా చిన్న బిల్డప్ ఇచ్చి అక్కడితో చేతులు దులిపేసుకున్నారు. లోకేష్ పరిస్థితి కూడా అంతే..! నోటిఫికేషన్ కంటె చాలా కాలం ముందుగానే మంత్రిగా ఓ అధికారిక పర్యటనకు వచ్చిన లోకేష్.. ప్రచారం జోరందుకున్నాక ఇటువైపు కూడా రాలేదు.

తెదేపా మంత్రులు ఒక్కరొక్కరుగా వచ్చి రోజులు గడిపి తిరిగి వెళ్తున్నారు తప్ప… నంద్యాల ఉప ఎన్నిక భారాన్ని తమ భుజస్కంధాల మీద మోస్తాం.. ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిని గెలిపిస్తాం అని భ‌రోసా ఇచ్చేవారె క‌రువ‌య్యారు. తెలుగుదేశం- భూమా బ్రహ్మానందరెడ్డిని గాలికొదిలేసినట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి.

మీకుంటుంబానికి టికెట్టిచ్చాం. అభ్య‌ర్తిని మీరె గెలిపించుకోండి. తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబం విషయంలో ఒక నిర్లిప్త ధోరణిని అవలంబిస్తున్నట్లుగా పలు విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. భూమా బ్రహ్మానందరెడ్డి తరుపున ప్రచారంలో ప్రధానంగా కనిపిస్తున్నది అఖిలప్రియ మాత్రమే. అటు మీడియాలోను, ఇటు జనంలోను ఆమె ముందుండి ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అలాగే పవన్ కల్యాణ్ ను ఎన్నికల ప్రచారానికి తీసుకురావచ్చుననుకున్న ప్రయత్నాలు కూడా ఫలించలేదు. తెలుగుదేశం పెద్దలు మాత్రం వ్యూహాత్మకంగానే ప్రచారానికి దూరం ఉన్నట్లుగా సమాచారం. గెలుస్తామ‌నె మాట‌త‌ప్పా ప్ర‌చారంలో మాత్రం ప‌ట్టుద‌ల క‌నిపించ‌డంలేద‌రు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -