Thursday, May 9, 2024
- Advertisement -

ఫిరాయింపు ఎమ్మెల్యేకు, టిడిపికి స్థానిక నేతల సూపర్ షాక్

- Advertisement -

2014 ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచి…..ఆ తర్వాత ప్రలోభాలకు ఆశపడి టిడిపిలో చేరాడు. చంద్రబాబు కూడా ప్రత్యర్థి పార్టీ నాయకుడు కూడా పార్టీలో చేరితే తిరుగేలేదనుకున్నాడు. అయితే కథ ఇప్పుడు పూర్తిగా అడ్డం తిరిగింది. ఫిరాయించిన ఎమ్మెల్యేకు, ఆ ఎమ్మెల్యేను చేర్చుకున్న టిడిపికి కూడా దిమ్మతిరిగే షాక్ తగిలింది. అధికార యావతో వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు కానీ స్థానిక నేతలు మాత్రం పూర్తిగా జగన్‌కే జై కొట్టారు. ఇప్పటికే ఆయా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల కార్యకర్తలు జగన్ నాయకత్వానే పనిచేస్తామని, వైకాపాను వీడేదిలేదని జంపింగ్ ఎమ్మెల్యేలకు తేల్చిచెప్తున్నారు. ఇక ఇప్పుడు స్థానిక నాయకులు కూడా పూర్తిగా కార్యకర్తల మాటకే కట్టుబడతామని చెప్పారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో సుజయ కృష్ణరంగారావు వైకాపా తరపున గెలిచారు. వైఎస్ జగన్ కూడా సుజయ కృష్ణా రంగారావుకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే చంద్రబాబు ప్రలోభాలకు ఆశపడి పార్టీ ఫిరాయించాడు సుజయకృష్ణ. ఇప్పుడు 2019 ఎన్నికలు దగ్గరపడుతుండడంతో సుజయకృష్ణకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే స్థానిక నేతలను చేరదీయాలని చూశాడు. లోకేష్ స్థాయిలో స్థానిక నేతలకు మళ్ళీ అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని ఆశచూపించారు టిడిపి పెద్దలు. అయితే స్థానిక నేతలు మాత్రం టిడిపికి, ఫిరాయింపు ఎమ్మెల్యేకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఐదుగురు ఎంపిటిసిలు, ఇద్దరు మాజీ జెడ్పీటీసీలతో పాటు నాయకులు, కార్యకర్తలంతా దాదాపు రెండు వేల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ హఠాత్పరిణామంతో విజయనగరం టిడిపి నాయకులు హతాశువులతుంటే వైకాపా నాయకులు, కార్యకర్తల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రం త్వరలోనే విజయనగరం జిల్లాలో అడుగిడనున్న నేపథ్యంలో వైకాపాకు ఇది చాలా పెద్ద సానుకూలాంశమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -