Friday, April 19, 2024
- Advertisement -

ఇంధనం పార్టీకా, బండికా?

- Advertisement -

బండి సంజయ్ అరెస్ట్ అంశాన్ని బీజేపీ హై కమాండ్ సీరియస్‌గా తీసుకుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తుంది. మామూలుగానే బిజెపి ఏ రాష్ట్రంలో అయినా రాజకీయంగా ప్రయోజనం వచ్చే ఏ సందర్భాన్నీ వదులుకోదు. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న బిజెపి తెలంగాణ, ఏపీల్లో ఏం జరిగినా స్పెషల్ ఇంట్రస్టే చూపిస్తుంటుంది. ఇప్పుడు జీవో 317 సవరణపై బండి జాగరణ కార్యక్రమం, అరెస్టు, ఆ తర్వాత పరిణామాలను జాతీయ నాయకత్వం బాగా వాడేసుకుంటోందని బిజెపి వర్గాలు చెప్పుకుంటున్నాయి.

పార్టీ జాతీయ అధ్యక్షుడు నిరసన దీక్షలో పాల్గొనడం.. రోజుకో కేంద్ర నేత ఇక్కడికి వస్తుండడం చూస్తుంటే, ఇది నిజమనిపించక మానదు. నడ్డా రియాక్ట్ అయిన తీరు, బండి సంజయ్‌ విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి భగవంతు కూబా అక్కడికి రావడం, ఆ మరుసటి రోజే ఛత్తీస్‌గడ్‌ మాజీ సీఎం రమణ్‌ సింగ్‌ వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం చూస్తుంటే.. తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.

ఇక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సొంత రాష్ట్రం పంజాబ్. అక్కడ ప్రధాని మోడీ పర్యటన ఉన్న సమయంలో కూడా, ఆయన అక్కడకు వెళ్లకుండా తెలంగాణలోనే ఉన్నారు. సంజయ్ విడుదల అయ్యే వరకు రాష్ట్రంలోనే ఉండి సమన్వయం చేసుకోవాలని హైకమాండ్‌ సూచించడంతో.. తరుణ్‌ చుగ్‌ ఇక్కడే మకాం వేశారట. వరుస ప్రెస్‌ మీట్లు పెట్టి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

బాబుగారి వీర ప్రేమ గాథ

ఏపీ ఉగ్యోగులకు తీపి కబురు

బాలయ్య దుమ్ము దుమారం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -