Thursday, May 9, 2024
- Advertisement -

బాబుకు షాక్ ఇచ్చేలా పురందేశ్వ‌రి వ్యాఖ్య‌లు..

- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పొత్తుకోసం రాజ‌కీయ పార్టీలు ఆరాట‌ప‌డుతున్నాయి. ప‌వ‌న్ ఇంకా టీడీపీకె స‌పోర్ట్ చేస్తార‌ని నేత‌లు అంటున్నా…ప‌వ‌న్ మాత్రం ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక‌హోదా ఇస్తాన‌న్న భాజాపా-టీడీపీకి మ‌ద్ద‌తు ప‌లికారు ప‌వ‌న్‌. అయితే ప్ర‌త్యేక హోదాపై చేతులెత్తేయ‌డంతో జ‌న‌సేన అధినేత మ‌ద్ద‌తు విష‌యంలో న్యూట‌ర్న్ తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా పొత్తుపై పురందేశ్వ‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

పవన్ కల్యాణ్ తమకు మిత్రుడేనని చెప్పిన ఆమె, పొత్తుకు తామెప్పుడూ ఓపెన్ గానే ఉంటామని, ఎవరితో కలసి వెళ్లాలన్న విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సింది పవన్ కల్యాణేనని స్పష్టం చేశారు. ఆయన వైపు నుంచి సానుకూల సంకేతాలు వస్తే, పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

రెండు పాచిపోయిన లడ్డూలను కేంద్రం ఏపీ ప్రజల చేతుల్లో పెట్టిందని గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రత్యేక హోదా సమసిపోయిన అంశమని, అంతకు మించిన లాభాన్ని రాష్ట్రం ఇప్పుడు ప్యాకేజీ రూపంలో అందుకుంటోందని అన్నారు.

చంద్ర‌బాబుపైకూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకుండా, కేంద్రానికే అప్పగిస్తే మరింత త్వరగా పనులు పూర్తయ్యుండేవని అభిప్రాయపడ్డారు. తదుపరి ఎన్నికల్లోగా, పోలవరం స్పిల్ వే, కాపర్ డ్యామ్ తదితరాల నిర్మాణం పూర్తవుతుందని భావించడం లేదని చంద్రబాబుకు షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -