Thursday, April 25, 2024
- Advertisement -

రాజ‌ధాని డిజైన్లు ఇప్ప‌టికీ ఖ‌రారు కాలేదు… భాజాపా

- Advertisement -

నిన్న‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షంగా ఉన్నా టీడీపీపై భాజాపా నేత‌లు మాట‌ల దాడిని పెంచారు. బాబు ప్ర‌భుత్వంలో జిరిగిన అవినీతిని త‌వ్వాలంటే గున‌పాలు స‌రిపోవ‌ని..బుల్డోడ‌జ‌ర్లు కావాల‌ని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు తెలిసిందే. ఇప్పుడు తాజాగా మ‌రో భ‌జాపా ఎమ్మెల్యే విష్ణ‌కుమార్ రాజు ఫైర్ అయ్యారు.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం మట్టి, నీరు ఇచ్చిందని విమర్శలు చేస్తున్నారని, మీరు మాత్రం హెలికాప్టర్ లో తిరిగి నీళ్లు చల్లి శుద్ధి చేస్తారా? అని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రాజధాని డిజైన్లు ఇప్పటివరకు ఖరారు చేయలేదని విమర్శించారు. రాజ‌ధాని నిర్మానం విష‌యంలో టీడీపీ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌ని మండిప‌డ్డారు.

రాజధానిలో 1000 బిల్డింగ్ లు కట్టడానికి కేవలం రూ.2000 కోట్లు ఖర్చు అవుతుందని, ఏపీ సర్కార్ మాత్రం రూ.40 వేల కోట్లు ఖర్చవుతుందంటూ తప్పుడు లెక్కలు చెబుతోందని, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఒక ఎస్ఎఫ్ టీ కి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ తాత్కాలిక అసెంబ్లీలో టాయిలెట్లు లేవని, వెంటిలేషన్ కూడా సరిగా లేదని విష్ణుకుమార్ రాజు విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -