Wednesday, May 8, 2024
- Advertisement -

బాబు అవినీతిని పెక‌లించాలంటే గుణ‌పాలు చాల‌వు… బుల్డోజ‌ర్లు కావాలి…..

- Advertisement -

ఏపీసీఎం చంద్ర‌బాబు చేసిన అవినీతిపై భాజాపా దుకుడు పెంచింది. అమిత్‌షా బాబుకు లేఖ రాసిన మ‌రుక్ష‌ణ‌మే ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బాబుపై రెచ్చిపోయారు. టీడీపీ డ్రామా పార్టీ అని ఆరోపించారు. ఒకపుడే జాతీయ స్ధాయిలో అవినీతికి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ చేసిన అవినీతి రహిత విప్లవం రాష్ట్రంలో కూడా రావాల్సిన అవసరం ఉందంన్నారు వీర్రాజు .

చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో జ‌రుగుత‌న్న అవినీతి దేశంలో ఎక్క‌డా జ‌ర‌గ‌డంలేద‌న్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తవ్వి తీయటానికి గునపాలు కూడా సరిపోవంటూ ఎద్దేవా చేశారు. అవినీతిని పెకిలించటానికి బుల్డోజర్లు కావాల్సిందేనంటూ ధ్వజమెత్తారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం గురించి వివరిస్తూ అందులో జరిగిన అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అసలు పట్టిసీమకు రూ. 1660 కోట్లెందుకు? స్పిల్ వేలో రూ. 1400 ఎందు ఖర్చయిందని నిలదీశారు. ప్రాజెక్టు ప్రాంతంలో మట్టి తవ్వితీయటానికే రూ. 67 కోట్లు ఖర్చు చేయటంపై వీర్రాజు ఆశ్చర్యం వ్తక్తం చేశారు. అవసరం లేకపోయినా రూ. 90 కోట్లు వ్యయం చేసి డయాఫ్రం వాల్ ఎందుకు కట్టారో చెప్పాలంటూ ప్రశ్నించారు.

ఏపీ వరదాయిని పోలవరంతోపాటు పట్టిసీమ, రాయలసీమ ప్రాజెక్టులు అవినీతికి నిలయంగా మారాయని సోము వీర్రాజు తెలిపారు. ‘‘పట్టిసీమలో అవినీతి తవ్వడానికి గునపలు చాలవు. ఒక ట్రాక్టర్ మట్టి తీయడానికి 4 లక్షల తినేస్తున్నారు. పట్టిసీమ 1125 కోట్ల నుంచి మొదలై 1667 కోట్లకు వెళ్ళింది. 24 పంపులు వేసి, 30 పంపులకు లెక్కలు కట్టారు. టెండర్లలో లేనివాటికి కోట్లు కుమ్మరించారు. మట్టి పేరుతో 67 కోట్లు నొక్కేశారు. జన్మభూమి కమిటీల పేరుతో ఒక్కో ఇంటికి రూ.20 వేలు వసూళ్లు చేస్తున్నారు. కొత్త పింఛన్ కు మూడు నెలల డబ్బులు ముందే తీసుకుంటున్నారు. నీరుచెట్టు ఓ నాటకం. ఆఖరికి స్కూళ్లలో ఆడపిల్లల కోసం కట్టిన టాయిలెట్ల నిర్వహణలోనూ చంద్రబాబు అండ్‌ కో నిధులు నాకేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అవినీతి ఏ స్ధాయిలో జరిగిందో చెప్పటానికి కాగ్ నివేదికే సాక్ష్యమని ఎంఎల్సీ అన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -