Saturday, April 20, 2024
- Advertisement -

అర్వింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఐదుగురు సీఎంలు!

- Advertisement -

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్టాన్ని ఐదుగురు ముఖ్య‌మంత్రులు పాలిస్తున్నారంటూ కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. క‌ల్వ‌కుంట్ల కుటుంబ స‌భ్యులు(మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్)ను ఉద్దేశించి ఈ మేర‌కు న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. జగిత్యాల పరిధిలోని లింగంపేట్ రైల్వే స్టేషన్ ని పరిశీలించిన సంద‌ర్భంగా ఆయ‌న మ‌ట్లాడారు. రైల్వే స్టేషన్ లో కావాల్సిన కనీస వసతుల కొరకు నివేదిక సిద్ధం చేయాలని స్టేషన్ మాస్టర్ ను అర్వింద్ ఆదేశించారు.

ఆ తర్వాత కార్యకర్తలతో మాట్లాడుతూ.. సీఎం కుర్చీని బీజేపీ సొంతం చేసుకుంటుందంటూ ఉత్సాహం నింపారు. తాము అధికారంలోకి రాగానే ఉపాద్యాయుల సమస్యలు పరిష్కరిస్తామ‌ని హామీ ఇచ్చారు. అదే విధంగా.. జగిత్యాలలోనే కాంగ్రెస్ ఉనికి ఉందంటే.. దానికి కారణం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అని, ఆయ‌న త‌న‌కు అంకులేన‌ని, ఆయనంటే అంటే నాకు ఇష్టమ‌ని చెప్పుకొచ్చారు. అయితే అదే స‌మ‌యంలో రాష్ట్రంలో ఇప్ప‌టికే కాంగ్రెస్ చ‌నిపోయింద‌ని, కాబ‌ట్టి ఎవ‌రిని పీసీసీ అధ్యక్షుడిని చేసినా లాభం ఉండదని విమ‌ర్శించారు. కాగా జీవ‌న్‌రెడ్డి పీసీసీ ప‌ద‌వి చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌ల ఊహాగానాలు వినిపించి విష‌యం తెలిసిందే.

ఇక దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న బీజేపీ… నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప‌ట్టు బిగించి, రాబోయే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు వ్యూహాలు ర‌చిస్తోంది. ఇక అర‌వింద్ నియోజ‌క‌వ‌ర్గంలో గ్రామీణ ప్రాంతాల‌పై గురిపెట్టిన క‌మ‌ల ద‌ళం.. పెద్ద సంఖ్య‌లో టీఆరెస్ నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకుంటోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత భూప‌తిరెడ్డి కాషాయ కండువా క‌ప్పుకొనేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

సాగర్‌ పోరు.. విజయం ఎవరిదో

చంద్ర‌బాబు అలా, అచ్చెన్నాయుడు ఇలా..

ఈసీ కీల‌క ఆదేశాలు.. ఏపీలో ప‌థకాల‌కు బ్రేక్‌!?

ఎస్‌ఈసీ సంచలన నిర్ణయం, వారంతా ఔట్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -