Saturday, April 20, 2024
- Advertisement -

ఈసీ కీల‌క ఆదేశాలు.. ఏపీలో ప‌థకాల‌కు బ్రేక్‌!?

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రోసారి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప్ర‌జ‌ల‌ను విస్మ‌యానికి గురిచేస్తోంది. అప్ప‌ట్లో క‌రోనా సాకు చెప్పి ఎన్నిక‌లు వాయిదా వేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.. ఇప్పుడు స్ట్రెయిన్ భ‌యాల నేప‌థ్యంలో గ్రామ పంచాయ‌తి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి వివాదానికి తెర‌తీశారు. కోవిడ్ వంటి జాతీయ విప‌త్తు ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్న స‌మ‌యంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ సాధ్యం కాద‌ని ప్ర‌భుత్వం చెప్పినా, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల‌తో పాటు ఉద్యోగ సంఘాల నేత‌ల‌ సైతం ఎస్ఈసీ తీరును ఆక్షేపిస్తున్నారు. ఏపీ ఎన్జీవో అయితే ఎన్నిక‌ల విధులు బ‌హిష్క‌రిస్తామ‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.

ఓ వైపు ఇంత ర‌చ్చ జ‌రుగుతున్నా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా తాజాగా మ‌రోసారి కీల‌క‌ ఉత్త‌ర్వులు జారీ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఎన్నికల కోడ్ ప్ర‌స్తావిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపేయాలంటూ సీఎస్‌కు ఎన్నిక‌ల‌ సంఘం సర్క్యులర్‌ జారీ చేసింది. దీంతో లక్షలాది మంది తల్లులు ఎదురుచూస్తున్న అమ్మఒడి పథకానికి అడ్డంకిగా ఏర్ప‌డింది. అంతేగాక పేద‌వారి సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చే ఇళ్లపట్టాల పంపిణీపైనా ఆంక్షలు విధించింది.

అయితే ఇందులో రాజకీయ దురుద్దేశం, వ్య‌క్తిగ‌త అజెండా స్ప‌ష్టంగా కనిపిస్తోందని ప‌లువురు మండిప‌డుతున్నారు. ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న తీరుపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఏదేమైనా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కాకుండా చేసి ప్ర‌జ‌ల‌ను క‌ష్ట‌పెట్ట‌డానికి చంద్ర‌బాబు వేసిన ఎత్తుగ‌డ ఇది అని చ‌ర్చించుకుంటున్నారు.

ఆడ‌బిడ్డ‌ను క‌ష్ట‌పెట్ట‌డం స‌బ‌బేనా బాబూ!

కొరడా ఝళిపించిన ఎన్నికల సంఘం

ఆయ‌నొక్క‌రే ప్ర‌భుత్వ ఉద్యోగా.. మీరు మార‌రా!

వీరి జోడీ.. భలే బాగు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -