Saturday, April 20, 2024
- Advertisement -

చంద్ర‌బాబు అలా, అచ్చెన్నాయుడు ఇలా..

- Advertisement -

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యం సాధించి.. అధికారం చేప‌ట్టిన నాటి నుంచి త‌న‌దైన పాల‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దూసుకుపోతూనే ఉన్నారు. ప‌లు స‌ర్వేలు వెల్ల‌డించిన బెస్్ట సీఎంల జాబితాలో టాప్‌-5లో నిలుస్తూ స‌త్తా చాటుతున్నారు. అన్ని వ‌ర్గాల‌కు స‌మ‌న్యాయం చేస్తూ ముందుకుసాగుతున్నారు. ముఖ్యంగా మంత్రివ‌ర్గ కూర్పు, కార్పొరేష‌న్ల ఏర్పాటు త‌దిత‌ర అంశాలు ఇందుకు నిద‌ర్శ‌నం. ఆల‌యాలు, చ‌ర్చిలు, ద‌ర్గాలు సంద‌ర్శిస్తూ తాను ప్ర‌జ‌ల సీఎంను అని నిరూపించుకుంటున్నారు. మాన‌వ‌త్వ‌మే త‌న మ‌తం అని స్పూర్తిగా నిలుస్తున్నారు. దీంతో ఆయ‌న‌పై కులం, మ‌తం కార్డు వేసి, అప్ర‌తిష్ట పాలుజేయాల‌న్న టీడీపీ కుట్ర‌ల‌కు తెర‌ప‌డ్డ‌ట్టు అయ్యింది.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల వ‌రుస‌గా విగ్ర‌హాల ధ్వంసం.. ముఖ్యంగా రామ‌తీర్థం ఘ‌ట‌న‌తో మ‌రోసారి విద్వేషాలు రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసింది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు నీచ రాజ‌కీయాల‌కు దిగింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల నుంచి ప్ర‌జ‌ల ద్రుష్టి మ‌ర‌ల్చే కుట్ర‌లు చేసింది. ఇక టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌లపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మూడు ద‌ఫాలు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశాను, 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం అని గొప్ప‌లు చెప్పుకునే ఆయ‌న.. ఏపీ డీజీపీ గౌతం స‌వాంగ్‌, విజయనగరం జిల్లా ఎస్పీకి సైతం మ‌తాన్ని అంటగట్టి దిగ‌జారుడుగా వ్య‌వ‌హ‌రించారు. విచ‌క్ష‌ణ కోల్పోయి మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శించేందుకు స‌రైన కార‌ణాలు దొర‌క‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వ అధికారుల‌ను టార్గెట్ చేశారు.

అయితే ముఖ్య‌మంత్రి మాత్రం సంయ‌మ‌నం పాటిస్తూనే.. టీడీపీ హ‌యాంలో కూల్చివేత‌కు గురైన ఆల‌యాల పున‌ర్నిర్మాణం చేప‌ట్టి చెంప‌మీద కొట్టిన‌ట్టుగా త‌న ప‌నితాను చేసుకుపోతున్నారు. అంతేగాక సౌభ్రాత‌`త్వం మ‌రింత‌గా పెంపొందించేందుకు మ‌త సామ‌రస్య క‌మిటీలు నియ‌మిస్తూ ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. అయితే దీనిపై కూడా రాద్దాంతం చేస్తోంది టీడీపీ. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు .. ఈ జీవోను చూస్తుంటే సెక్రటేరియట్‌లో అధికారులు తయారు చేసినట్టు లేదని, తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో తయారు చేసినట్టు ఉందని, అలాగే, ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ వైఎస్సార్‌ సీపీ కండువా కప్పుకోవాలంటూ ప్ర‌భుత్వ అధికారుల‌ను అగౌర‌వ‌పరిచారు.

దీంతో టీడీపీ తీరుపై ఆగ్ర‌హం పెల్లుబుకుతోంది. క‌రోనా స‌మ‌యంలో గ్రామ పంచాయ‌తి ఎన్నిక‌ల షెడ్యూల్ జారీ చేసి ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ణంగా పెడుతున్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ మాత్ర‌మే ప్ర‌భుత్వ అధికారా? ప‌్ర‌జా సంక్షేమాన్ని ఆశించి జీవోలు జారీ చేస్తే మాత్రం వారికి పార్టీ పేరును ఆపాదిస్తారా? మీకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తే స‌రి లేదంటే ఇలా బుర‌ద‌జ‌ల్లుతారా అని మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా చెత్త రాజ‌కీయాలు మానుకోకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ 23 సీట్లు కూడా రావు అంటూ చుర‌క‌లు అంటిస్తున్నారు.

చంద్రబాబు పై విజయసాయిరెడ్డి ఆగ్రహం..!

కొరడా ఝళిపించిన ఎన్నికల సంఘం

ద‌మ్ము, ధైర్యం లేనోడు.. భార్గ‌వ్‌రామ్‌పై ఫైర్‌!

కేసీఆర్‌కు హెల్త్‌ చెకప్‌, నెక్ట్స్‌ సీఎం ఆయనేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -