Friday, April 26, 2024
- Advertisement -

ఎస్‌ఈసీ సంచలన నిర్ణయం, వారంతా ఔట్‌!

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలు ఇవ్వనివారిపై వేటు వేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల మందిపై అనర్హత వేటు పడనుంది. ఫలితంగా ఆయా ఎన్నికల్లో గెలిచినవారు పదవులు కోల్పోగా.. ఓడినవారు మూడేళ్లపాటు పోటీకి అనర్హులవుతారు. 2019లో రాష్ట్రంలో జరిగిన పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో వార్డు సభ్యులు మొదలుకొని జడ్పీటీసీల వరకు పోటీచేసిన వారిలో 39,499 మంది ఎస్‌ఈసీ నిర్ణయంతో అనర్హతకు గురయ్యారు.

అనర్హతకు గురైనవారిలో ఆ ఎన్నికల్లో ఓడిన వేలాది మందితోపాటు గెలిచి సర్పంచ్‌లు అయిన 17 మంది, వార్డు సభ్యులు 3,499 మంది, ఎంపీటీసీలు ఆరుగురు ఉన్నారు. దీంతో గెలిచి అనర్హత వేటుకు గురయినవారి స్థానాలతోపాటు, వివిధ కారణాలతో ఏర్పడిన ఖాళీలకు త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మొదట వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తోపాట, కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి, తదనంతంర గ్రామీణ స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ వర్గాల సమాచారం.

నిబంధనలివే…
తెలంగాణలో 2019 జనవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులంతా తమ ఖర్చు వివరాలు మొత్తం రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించాలి. దీనికి గెలుపోటములతో సంబంధం లేదు. ప్రతీ అభ్యర్థీ తమ వ్యయ వివరాలను, ఎన్నికల ఫలితాలు వెల్లడైన 45 రోజులలోపు అందించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా వివరాలు సమర్పించకపోతే ఈసీ చర్యలు తీసుకుంటుంది.

తాజాగా ఎన్నికల కమిషన్‌ ఆ పనే చేసింది. ఇక ఖర్చుల మొత్త వివరాలకు వస్తే.. ఐదు వేలకుపైగా జనా భా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థి రూ.2.50లక్షలు, వార్డు మెంబర్‌ అభ్యర్థి రూ.50వేలు మాత్రమే వ్యయం చేయాలి. అలాగే ఐదు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థి రూ.1.50లక్షలు, వార్డు అభ్యర్థి రూ.30వేలు దాటకుండా ఖర్చు చేయాలి.

ఆ రెండు పదవుల్లో కేటీఆర్‌, హరీష్‌!

అఖిల ప్రియ ఎందుకిలా.. ‘భూమా’ ప్ర‌తిష్ట ఏం కావాలి?

ఆడ‌బిడ్డ‌ను క‌ష్ట‌పెట్ట‌డం స‌బ‌బేనా బాబూ!

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా కృష్ణంరాజు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -