Monday, April 29, 2024
- Advertisement -

పొత్తులను నమ్ముకోలేదు: సి‌ఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -

సి‌ఎం జగన్ పొత్తులపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు ఎవరితోనూ పొత్తులు ఉండబోవని, తమ పొత్తు ప్రజలతోనే అని స్పష్టం చేశారు. మదనపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సి‌ఎం జగన్.. నేడు జగనన్న విద్యదీవెన కు సంబంధించిన నగదు బదలిని బటన్ నొక్కి లబ్ది దారుల ఖాతాలో జమచేశారు సి‌ఎం జగన్. 11.02 లక్షల విద్యార్థులకు 694 కోట్లు ఈ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా అందించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడినా జగన్.. చంద్రబాబు లాగా తాను దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదని, తాను ప్రజలను నమ్ముకున్నని జగన్ చెపుకొచ్చారు. తాను రాక్షసులతో యుద్దం చేస్తున్నానని ఈ యుద్దంలో మీ సహకారం కావాలని ప్రజలను కోరారు సి‌ఎం జగన్. ఇక ఎలాంటి పొత్తులకు తామే వెళ్లబోమని జగన్ మరోసారి తేల్చి చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగబోతుందనే విషయంపై స్పష్టత వచ్చింది.

అయితే ఆ మద్య విశాఖకు ప్రధాని మోడి వచ్చిన వేళలో కూడా జగన్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మరి వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్న వైఎస్ జగన్ కు ఎలాంటి పొత్తులు లేకుండా నిర్దేశించుకున్న టార్గెట్ రిచ్ అవుతాడా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కాగా ఒకవేళ జగన్ పొత్తులకోసం ట్రై చేసిన జగన్ తో చేతులు కలిపేందుకు ఏ పార్టీ కూడా సిద్దంగా లేదు. ఎందుకంటే టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కాబట్టి ఆ పార్టీతో వైసీపీ కలిసే ప్రసక్తే లేదు. ఇక జనసేన కూడా వైసీపీకి పూర్తి విరుద్దం.. ఇక మిగిలింది బీజేపీ ఈ పార్టీ ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉంది. ఒకవేళ వైసీపీతో కలిస్తే పవన్ను దూరం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి బీజేపీ పవన్ను వదులుకోవడానికి ఏ మాత్రం సిద్దంగా లేదు. అందువల్ల కాషాయ పార్టీ కూడా జగన్ తో కలిసే చాన్సే లేదు. ఇవన్నీ పరిశీలిస్తే జగన్ తో కలిసేందుకు ఏ పార్టీ కూడా దరిదాపుల్లో కనిపించకపోవడంతోనే ఆయన ఎలాంటి పొత్తులు లేవని చెబుతున్నారని కొందరి రాజకీయవాదుల అభిప్రాయం.

ఇవి కూడా చదవండి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -