చంద్రబాబుని ప్రేమిస్తాడా లేదా?

- Advertisement -

ఏపీలో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ మాంచి రసవత్తరంగా నడుస్తోంది. టిడిపి బాణాలు వేస్తోంది. బిజెపి కూడా తగ్గేది లేదంటోంది. ఈ రెండూ జనసేనను తెగ ప్రేమిస్తుంటే, అసలు వ్యక్తిలో మాత్రం చలనం లేదు. మరి పవర్‌ స్టార్‌ ఎవరి పక్షం ఉంటారో, ఎవర్ని ప్రేమిస్తారో మరి?

ఏపీలో ఈసారి గెలిచి తీరుతాం అంటున్న టిడిపి నేతలు, జనసేన గురించి భారీగానే ఆశలు పెట్టుకుంటున్నారు. మీడియా ముందుకు వచ్చేవారు కొందరైతే, తెరవెనుక చర్చల్లో మరికొందరు ఆసక్తి చూపుతున్నారట. స్వయంగా అధినేత చంద్రబాబునే దీనిపై ప్రశ్నిస్తున్నారు. కుప్పం టూర్‌ లో చంద్రబాబు వన్‌ సైవ్‌ తో ప్రయోజనం ఏంటని సమాధానం కూడా చెప్పేశారు. అంటే, టిడిపికి ఆసక్తి ఉన్నా, జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్‌ లేదని అర్థమౌతోంది.

- Advertisement -

2014 ఎన్నికల తర్వాత టిడిపి, బిజెపి లనుంచి దూరంగా వచ్చిన పవన్‌ కల్యాణ్‌ 2019లో లెఫ్ట్‌ పార్టీలతో కలిసి పోటీ చేసినా, ఓటమిపాలయ్యారు. స్వయంగా పవన్‌ కల్యాణ్ కూడా రెండు చోట్ల ఓడిపోయారు. ఆ తర్వాత, కొంత కాలానికి అనూహ్యంగా బిజెపి పంచన చేరారు. అధికారికంగా రెండు పార్టీల మధ్య పొత్తు నడుస్తోంది. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో, తిరుపతి సీటు విషయంలో, బద్వేలు ఎన్నిక పైనా ఒక్కమాట మీద కనిపించ లేదు. దీంతో ఈ రెండు పార్టీల పొత్త ఫ్యూచర్‌ పైనా ప్రశ్నలు నడుస్తున్నాయి. కానీ, ఈ లోపే, తాము కలిసే ఉన్నామని, కలిసే పోటీ చేస్తామని సోము వీర్రాజు చెప్తున్నారు. ఇన్ని జరుగుతున్నా జనసేన నుంచి మాత్రం దీనిపై ఎలాంటి రియాక్షన్‌ రావటం లేదు. పవన్‌ సమాధానం ఏమిటా అనే ఆసక్తి ఏపీ రాజకీయాల్లో ఏర్పడింది.

అయితే సినిమాలు వాయిదా వేసుకోండి..!

ధర్మాన ధర్మ సంకటం

ఇంధనం పార్టీకా, బండికా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -