Friday, May 3, 2024
- Advertisement -

జ‌గ‌న్‌ను దెబ్బ కొట్టేంద‌కు బాబు ఆలోచ‌ల‌న‌ల‌కు అనుగునంగానె ప‌వ‌న్ కార్యాచ‌ర‌ణ‌…

- Advertisement -

జ‌గ‌న్‌ను దెబ్బ కొట్టేంద‌కు బాబు ఆలోచ‌ల‌న‌ల‌కు అనుగునంగానె ప‌వ‌న్ కార్యాచ‌ర‌ణ‌…
వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రో సారి అధికారంలోకి రావ‌డానికి చంద్ర‌బాబు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌న‌కు పోటీగా ఏపార్టీ ఉండ‌కూడ‌ద‌నె ఉద్దేశ్యంతో అడ్డ‌దారులు తొక్కుతు పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. టీడీపీకి ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్ష‌మైన వైసీపీని నిర్వేర్యం చేసేందుకు బాబు చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. అందుకె ఇప్పుడు ప‌వ‌న్‌తోక‌ల‌సి జ‌గ‌న్‌కు చెక్ పెట్టేందుకు మ‌రో మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఎన్నిక‌ల్లో పొత్తులు ప్ర‌ధాన పాత్ర‌ను పోషించ‌నున్నాయి. ఏఏ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయో ఇప్ప‌డే చెప్ప‌లేని ప‌రిస్థితి. ఒక వైపు జ‌న‌సేన ప్ర‌భుత్వం పై పైకి విమ‌ర్శ‌లు చేస్తున్నా లోప‌ల మాత్రం టీడీపీకి స‌పోర్ట్ ఇస్తోంద‌నె వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మ‌రో వైపు వ‌చ్చె ఎన్న‌కిల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించింది. ఇక్క‌డ‌నె చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

రాష్ట్రంలో భాజాపా-వామ‌ప‌క్షాలు క‌ల‌సి పోటీ చేయ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. ప్ర‌త్యేక హోదాపై మాట్లాడుతున్న ప‌వ‌న్ తో భాజాపా పొత్తు పెట్టుకోవాలంటె ఆలోచించాల్సిందె. ఎందుకంటె ప్ర‌త్యేక‌హోదా ముగిసిన అధ్యాయ‌మ‌ని ఇప్ప‌టికె కేంద్రం ప్ర‌క‌టించింది. అందుకె భాజపాను , వామపక్షాలను చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ఇద్ద‌రు పంచుకునే ఆలోచనలు సాగుతన్నట్లు తెలుస్తోంది. ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాడుతున్న వామ‌ప‌క్షాలు జ‌న‌సేన‌తో క‌ల‌సి పోటి చేయ‌నున్నాయ‌న‌డంలో సందేహంలేదు.

వామ‌ప‌క్షాల‌ను జ‌న‌సేన‌తోను, భాజాపా టీడీపీతోను వేరు వేరుగా ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఎన్నిక‌ల అనంత‌రం పొత్తు పెట్టుకొనె ఆలోచ‌న‌లు సాగుతున్న‌ట్లు తెలుస్తోది దీని ద్వారా వైకాపాను నిలవరించాలన్న చంద్రబాబు ప్రణాళికకు అనుగుణంగా పవన్ తన రాజకీయ కార్యాచరణ రూపొందించుకుంటున్నారనె వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కాపు ఓట్ల‌ను తెలుగుదేశం నుంచి వైకాపాకు వెళ్లకుండా పవన్ దారి మళ్లిస్తారనె వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -