Tuesday, May 7, 2024
- Advertisement -

చంద్రబాబు…క్వాష్ పిటిషన్ వాయిదా

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను వాయిదా వేసింది న్యాయస్థానం. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నుండి తన పేరును తొలగించాలని, ఉద్దేశ పూర్వకంగా తనను ఇరికించారని క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా దీనిని ఈ నెల 19కి వాయిదా వేసింది న్యాయస్ధానం. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో ముందస్తు బెయిల్ విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. దీంతో చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.

అయితే చంద్రబాబుకు స్వల్ప ఊరట కలిగించే విషయం ఏంటంటే సీఐడీ పిటిషన్‌పై ఈ నెల 18వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. ఇదే అంశాన్ని ప్రస్తావించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. దీంతో సోమవారం వరకు కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశించింది.

ఇక నిన్న భద్రతా కారణాల నేపథ్యంలో హౌస్‌ రిమాండ్‌లో ఉంచాలని కోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను తిరస్కరించింది న్యాయస్ధానం. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ముప్పులేదన్న సీఐడీ వాదనలతో ఏకీభవించింది. ఇక తాజాగా బాబు క్వాష్ పిటిషన్‌పై ఆశలు పెట్టుకోగా దీనిని వాయిదా వేసింది. దీంతో 14 రోజుల జైలు జీవితం చంద్రబాబుకు తప్పేలా కనిపించడం లేదు. అయితే సోమవారం చంద్రబాబుకు కస్టడీకి సంబంధించిన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని విచారణకు అప్పగిస్తే బాబుకు చిక్కులు తప్పవు. విచారణకు బాబు సహకరించకపోతే రిమాండ్‌ను పొడగించమని సీఐడీ కోరే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -