Saturday, May 4, 2024
- Advertisement -

జగన్ ఇల్లు కూల్చితే.. ప్రజలు ప్రభుత్వాన్ని కూల్చుతారు !

- Advertisement -

ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణలో భాగంగా పేదల ఇళ్లను కూల్చడంతో జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష, విపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఏ అధికారంతో పేదల ఇళ్లను కూల్చుతున్నారని, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందని, అందుకే దిక్కుమాలిన పనులను చేస్తోందంటూ చంద్రబాబు మండిపడ్డారు. శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటాయని, ఇక మిగిలింది ప్రభుత్వ పతనమే అంటూ హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్ అంటేనే, హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు గా మార్చేశారని బాబు ట్విట్టర్ లో రాసుకొచ్చారు. .

ముఖ్యమంత్రి అహంకారానికి, అధికార మదనికి ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని.. చంద్రబాబు వ్యాఖ్యానించారు. 600 ఇళ్ళు ఉన్న ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్లు విస్తరిస్తారా ? మీవి రోడ్లు వేసే మోహలేనా ? అంటూ ప్రశ్నించారు. ఇప్పటం గ్రామం వెలుతున్న పవన్ ను అడ్డుకుంటేనో.. చీకట్లో మా పై రాళ్ళు వేస్తేనో.. పైచేయి సాధించలేరని, కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి అంటూ ట్విట్టర్ లో బాబు విమర్శనస్త్రాలు సంధించారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ ఇప్పటం గ్రామ పర్యటనలో పోలీసులు అడ్డగింపు చర్యలకు పాల్పడడంతో మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తనదైన రీతిలో ఫైర్ అయ్యారు. ఏది ఏమైనప్పటికి జగన్ సర్కార్ వర్సస్ టీడీపీ, జనసేన మద్య జరుగుతోన్న ఈ రాజకీయ వివాదాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -