- Advertisement -
విశాఖపట్నం శారదపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు సీఎం జగన్. శారదపీఠం రాజశ్యామల యాగంలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు జగన్.
సంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠంలోని దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సీఎం జగన్ పాల్గొన్నారు.
సీఎం హోదాలో నాలుగోసారి శారదా పీఠానికి వచ్చారు జగన్. సీఎం జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇక ఇటీవలె చంద్రబాబు తన నివాసంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించగా తాజాగా జగన్ శారదా పీఠాన్ని సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.
