Thursday, May 23, 2024
- Advertisement -

ఏపిలో అమూల్ ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం జగన్!

- Advertisement -

సిఎం జగన్‌ ఏపి అమూల్‌ ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏపి అమూల్‌ వెబ్‌సెట్‌, డ్యాష్‌ బోర్టును సిఎం ఆవిష్కరించారు. తొలి విడతలో ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లోని 4వందల గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. లీటర్‌కు 5 నుంచి 7 రూపాయలు అధిక ఆదాయం పాడిరైతులకు లభిస్తుందని తెలిపారు. సహకార రంగంలో ఏర్పాటైన అముల్ సంస్థ ప్రపంచ స్థాయి కంపెనీలతో పోటీ పడుతోందని అన్నారు.

అముల్ రావటంతో ఏపిలో పాలసహకార విప్లవం మొదలైందని చెప్పొచ్చని వ్యాఖ్యానించారు. దశలవారీగా 6,551కోట్ల వ్యయంతో ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని సిఎం జగన్ తెలిపారు.

Also Read

ఏపి అసెంబ్లీలో సీఎం జగన్ ప్లే చేసిన వీడియోకి పడీ పడీ నవ్వారు!

పవన్ కళ్యాన్ పర్యటనలో అపశృతి!

చంద్రుని పై చైనా కొత్త పోరాటం..!

తమిళనాట ” బురేవి ” అలెర్ట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -