Saturday, April 20, 2024
- Advertisement -

సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. అధికారుల్లో టెన్షన్..!

- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టరేట్‌తోపాటు పోలీసు కమిషనరేట్‌ను, ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని సైతం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి సమీకృత కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి హరీష్ రావు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం నిర్వహించనున్నారు.

అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. భిక్కనూరు మండలంలోని జంగంపల్లిలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలనూ సీఎం ప్రారంభించే అవకాశం ఉంది. అయితే, తిరుగు ప్రయాణంలో ఏ గ్రామాన్ని అయినా ఆకస్మికంగా సందర్శించవచ్చనే సమాచారంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఇక 21 న వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.

కాళోజీ యూనివర్సిటీ, వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్లను ప్రారంభిస్తారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజచేయనున్నారు. 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వెళ్లన్నారు. గ్రామ ప్రజలతో సమస్యలపై చర్చించి, వారితో సహపంక్తి భోజనం చేయనున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీల వల్ల అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

జూలై ఫస్ట్ వీక్ లో సెట్స్ పైకి ‘సర్కారు వారిపాట’..!

శేఖర్​ కమ్ముల సినిమాలో మరోసారి ఛాన్స్ కొట్టిన సాయిపల్లవి..!

వైద్య పరీక్షల కోసం అమెరికాకు బయల్దేరిన రజనీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -