Wednesday, May 8, 2024
- Advertisement -

సీఎం జగన్ తెగ మెచ్చుకుంటున్న తెలంగాణ ఉద్యోగులు!

- Advertisement -

మాట తప్పను మడుమ తిప్పను అన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ.. తండ్రి ఆశయాలు తూ.చ. తప్పకుండా అమలు పరుస్తున్నారు. అందుకే ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించారు. దీనికి దిర్శనం ఆయన 20 నెలల పాలనకు ప్రజలు ఇచ్చిన గిఫ్ట్ ఏపిలో ఇటీవల జరిగిన పంచాయితీరాజ్, మున్సిపల్ ఎన్నికలే నిలువెత్తు సాక్ష్యం. అలాంటి వైఎస్ జగన్ ని ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తమ కుటుంబాలు హైదరాబాద్‌లో ఉన్నాయిని, తాము ఏపీలో ఉద్యోగం చేయటం ఇబ్బందిగా ఉందని సీఎం జగన్‌కు వివరించారు.  వారి ఇబ్బందులు సానుకూలంగా విన్న సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

గతంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశాన్ని సీఎం జగన్‌ ప్రస్తావించగా, సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణ నుంచి ఏపీకి సంబంధిత ఫైల్‌ను పంపింది. ఈ నేపథ్యంలతో ఉద్యోగుల బదిలీ ఫైల్‌ను క్లియర్ చేసి తెలంగాణకు పంపాల్సిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గొప్ప మనసుతో అంగీకరించి సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక‍్తం చేశారు. 

నరేంద్ర మోదీ ని చంపడానికి ప్లాన్.. పోలీసులకి ఊరట..!

వైఎస్సార్ భీమా లబ్దిదారులకు శుభవార్త.. రూ. 254 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్‌‌!

మోహన్‌కందా రాత కి వెంకయ్య పలుకులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -