Monday, May 13, 2024
- Advertisement -

వైఎస్సార్ భీమా లబ్దిదారులకు శుభవార్త.. రూ. 254 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్‌‌!

- Advertisement -

ఏదైనా అనుకోని విపత్తు కారణంగా ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అయ్యేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదు విడుదల చేశారు. బాధితులతో పాటు వారి కుటుంబాలను సైతం ఆర్థికంగా ఆదుకున్నారు.

ప్రమాదవశాత్తూ చనిపోయినా, లేదా ప్రమాదం అనంతరం శాశ్వత అంగవైక్యలానిక దారి తీసినా అటువంటి వారి కుటుంబాలకు ఏపీ సీఎం వైఎస్ అండగా నిలుస్తున్నారు. ఈ మేరకు బుధవారం నాడు లబ్దిదారులకు రూ.254 కోట్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇది అర్హులైన లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ అవుతుందని పేర్కొన్నారు.

వాలంటీర్ల ద్వారా కొత్తగా 61 లక్షల మంది అకౌంట్‌లను ప్రారంభించామన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆ కుటుంబాలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చిందన్నారు. సహజ మరణానికి రూ.2లక్షలు, ప్రమాద మరణం, శాశ్వత అంగవైకల్యానికి రూ.5లక్షలు(18-50 వయస్సు), రూ.3లక్షలు (51-70 వయస్సు) బీమా… అలాగే పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి రూ.1.5 లక్షల బీమా అందించనున్నారు.

అధికారులు సర్వే చేపట్టిన సమయంలో అర్హులుకాని వారు, అనంతరం కాలంలో అర్హులుగా మారిన వారి కుటుంబాలకు సైతం వైఎస్సార్ భీమాను అందజేయాలని మానవతాదృక్పథంతో వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సహజ మరణం చెందిన కుటుంబానికి వైఎస్ఆర్ భీమా రూ.2 లక్షలు అందజేశారు.

టోర్నీ వాయిదా.. క్రీడా అభిమానులకి చేదు వార్త..!

ధోనీ సేన పై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..!

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి షాకుల మీద షాకులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -