Thursday, May 2, 2024
- Advertisement -

టిడిపిలో కోల్డ్ వార్…..బాబుపై తనదే గెలుపన్న మంత్రి

- Advertisement -

2019 ఎన్నికల నాటికి గంటా శ్రీనివాసరావు టిడిపిని వీడడం ఖాయం అనడంలో సందేహంలేదు. ఆ విషయాన్ని స్వయంగా గంటానే తన సన్నిహితులకు చెప్పేశాడు. ఆ విషయం తెలుసుకున్న చంద్రబాబు కూడా గంటాకు మరో మార్గం లేకుండా చేయడానికి నానా పాట్లూ పడుతున్నాడు. గంటా విషయంలో అన్ని వైపుల నుంచీ ఉచ్చు బిగుస్తున్నాడు. ఒక వైపు అచ్చెన్నాయుడితో గంటా శ్రీనివాసరావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయిస్తున్నాడు. గంటా శ్రీనివాసరావు అవినీతి గురించి విశాఖతో పాటు ఉత్తరాంధ్ర మొత్తం చర్చనీయాంశం అయ్యేలా బాబే చేస్తున్నాడన్న అనుమానాలు గంటా వర్గంలో ఉన్నాయి.
మరోవైపు గంటా శ్రీనివాసరావు కూడా తన జాగ్రత్తలో తాను ఉన్నాడు. కొణతాల రామకృష్ణను టిడిపిలోకి తీసుకొచ్చి గంటాను చావుదెబ్బ కొట్టాలనుకున్న బాబు పాచికలు పారనీయడంలేదు. కొణతాలతో గంటాకు తీవ్రస్థాయి శతృత్వం ఉంది మరి. అలాగే పవన్ కళ్యాణ్‌పై ఘాటుగా విమర్శలు చేయాలని చంద్రబాబు ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ గంటా మాత్రం కేర్ చేయడంలేదు.

కర్ణాటక నాట పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏర్పడతాయి అని అనుకుంటే……పవన్ కళ్యాణ్ సిఎం అవుతాడు అనుకుంటే …….ఆ మరుక్షణమే గంటా జనసేన పార్టీలో చేరతాడు అనడంలో సందేహం లేదు. ఇక జనసేన పార్టీకి 2019లో అతీగతీ ఉండదు అని తెలిస్తే మాత్రం వైకాపాలో గంటా చేరిక ఖాయం అన్నది విశ్లేషకుల భావన. ఏది ఏమైనా గంటా వర్సెస్ చంద్రబాబు నాటకం మాత్రం ఉత్తరాంధ్ర రాజకీయాలను రంజుగా మారుస్తోంది.

2014 ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే గంటాను ఉప ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి పార్టీలో చేర్చుకున్నాడు చంద్రబాబు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే గంటాకు హ్యాండ్ ఇచ్చాడు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కూడా అనుక్షణం అవకాశం వస్తే బాబును దెబ్బకొట్టడానికే గంటాతో పాటు ఆయన సన్నిహితులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి రాజకీయాల్లో ప్రపంచానికే పాఠాలు చెప్పగల చంద్రబాబుకు నిజంగానే గంటా గుణపాఠం చెప్పగలడా? అదే చేశాడంటే మాత్రం చంద్రబాబుతో పాటు టిడిపికి కూడా 2019 ఎన్నికల్లో చావుదెబ్బ ఖాయం అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -