తెలంగాణాలో ఎన్నికల వేల కాంగ్రెస్ పార్టీకీ బిగ్‌షాక్ తగిలింది. ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మెన్‌గా ఉన్న దామోదర రాజనరశింహ భార్య పద్మినిరెడ్డి భాజాపా అధ్యక్షుడు లక్ష్మన్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే పద్మినిరెడ్డి బీజేపీలో చేరారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఓవైపు కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు దామోదర రాజనర్సింహ కృషి చేస్తుంటే.. ఆయన సతీమణి మాత్రం ఇలా బీజేపీలో చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దామోదర రాజనర్సింహ అనుమతితో తీసుకునే ఆమె బీజేపీలో చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ తరుపున సంగారెడ్డి నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని పద్మినిరెడ్డి చాలాకాలంగా భావిస్తున్నారు. ఇందుకోసం సంగారెడ్డిలో కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. అయితే కుటుంబంలో ఒకరికే టికెట్ అన్న సూత్రంతో కాంగ్రెస్‌తో ముందుకెల్తే ఎదుగుదల కష్టమనుకున్నారు పద్మినిరెడ్డి.
