- Advertisement -

తూఛ్… మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చేసిన పద్మినీరెడ్డి

- Advertisement -

ఉదయం బీజేపీ తీర్ధం పుచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి రాత్రికి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరిపోయారు. గురువారం ఉదయమే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో పద్మినిరెడ్డి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర చర్చ జరిగింది. ఇక ప్రతిపక్ష టీఆర్ఎస్ నేతల సెటైర్లకు లోటే లేదు. దామోదర రాజనర్సింహ చేస్తున్న మ్యానిఫెస్టో ఆయన భార్యకే నచ్చలేదు. ఆమెకే నమ్మకం కుదరలేదు. అందుకే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి, బీజేపీలో చేరిపోయారు. అంటూ హరీశ్ రావు సహా టీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్లు, కార్యకర్తలు సైతం దామోదర రాజనర్సింహ తీరుని ఎండగట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు కాంగ్రెస్ చాలా సముచిత స్థానాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించిన కాంగ్రెస్ పార్టీని అవమానించేలా రాజనర్శింహ తన సతీమణిని, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధి అయిన బీజేపీలో చేర్చడం ఏంటని మండిపడ్డారు. దామోదరకు ఇష్టం లేకపోతే సతీసమేతంగా ఏ పార్టీలో చేరినా అభ్యంతరం లేదు కానీ, ఇలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉంటూ, తన సతీమణిని బీజేపీలో చేర్పించడం ఏంటని ప్రశ్నించారు.

మరోవైపు నెటిజన్లు, మీడియా ప్రతినిధులు కూడా ఇదే తరహాలో దామోదర రాజనర్సింహాను నిలదీశారు. మీ పార్టీపైనా, మీ మ్యానిఫెస్టోపైనా మీ సతీమణికి నమ్మకం లేదా ? కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డిని ఓడించడానికే బీజేపీలో చేరారా ? టీఆర్ఎస్ కేసీఆర్ తో రహస్య ఒప్పందం వల్లే పద్మినిరెడ్డిని బీజేపీలో చేర్చారా ? టీఆర్ఎస్ ప్రత్యర్ధి జగ్గారెడ్డి కనుక అతడిని ఓడించాలనే ఆమెను సంగారెడ్డి నుంచి బీజేపీ తరఫున పోటీ చేయిస్తున్నారా ? మీకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన కాంగ్రెస్ పట్ల మీ ధోరణి సబబేనా ? అంటూ మీడియా ప్రతినిధులు దామోదర రాజనర్శింహపై ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో ఆయన వారికి సమాధానం చెప్పలేక చిందులు తొక్కారు. ఇది తమ కుటుంబ వ్యవహారమని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇది కుటుంబ వ్యవహారం ఎలా అవుతుంది ? మీకు ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించిన పార్టీ పరువుకు సంబంధించిన అంశం కదా ! అని కాంగ్రెస్ సీనియర్లు, అధిష్టానం నిలదీయడంతో దామోదర దంపతులు పునరాలోచనలో పడ్డారు. అనుకోకుండా బీజేపీలో చేరాను, మళ్లీ నేను కాంగ్రెస్ లోకే వచ్చేస్తున్నాను…అంటూ పద్మినిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానుల మనోవేదన చూసి తన నిర్ణయాన్ని, మార్చుకుని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. తిరిగి కాంగ్రెస్‌ గూటికే చేరినట్టు ఆమె ప్రకటించారు. తాను బీజేపీలో చేరడంవల్ల ఇంత భారీ స్థాయిలో కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి స్పందన వస్తుందని ఊహించలేదన్నారు. తాజాగా ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయింది. దామోదర రాజనర్శింపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేస్తుందనే భయంతో పాటు కీలక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించిన పార్టీకే వెన్నుపోటు పొడిచారన్న అపఖ్యాతి మూటగట్టుకోవడం వల్ల, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలవరు అనే అనుమానం, భయంతోనే పద్మిని రెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిపోయారని వారి సన్నిహితులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -