Friday, April 26, 2024
- Advertisement -

జమ్ముకశ్మీర్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం..!

- Advertisement -

జమ్ముకశ్మీర్​ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గతేడాది ఆ రాష్ట్ర స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన అనంతరం.. తొలిసారిగా అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్​ పంచాయతీరాజ్​ చట్టంలోని 73వ సవరణను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా.. జమ్ముకశ్మీర్​లోని మొత్తం 20 జిల్లాల్లో 280 డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్ కౌన్సిల్​ (డీడీసీ)లను ఏర్పాటు చేశారు.

నవంబర్​ 28 నుంచి డిసెంబర్​ 19 వరకు మొత్తం 8 విడతల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహించారు. ఫలితంగా జమ్ముకశ్మీర్​లో సరికొత్త అధ్యాయం మొదలైంది. మంగళవారం ఉదయం 9గంటల నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో డీడీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. జమ్ముకశ్మీర్​ స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 20 జిల్లాల్లో 280 డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్ కౌన్సిల్​ (డీడీసీ)లకు మొత్తం 8 విడతల్లో పోలింగ్​ జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -