కాంగ్రెస్ కు వరుస షాకులు.. మరో నేత గుడ్ బై !

- Advertisement -

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వరుసగా పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇటీవల ఆ పార్టీలోని కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు దూరం కాగా, ఇప్పుడు తాజాగా ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవ‌ణ్‌ కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ లోని కీలక నాయకులు వరుసగా పార్టీకి దూరమౌతుండడంతో అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఇక పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు గట్టిగానే వినిపించాయి. ఎందుకంటే ఇటీవల ఆయన సహోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తరువాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అందులో రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల వెంకట్ రెడ్డి కాస్త అసహనానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్తారా ? అనే వార్తలు వచ్చాయి.

- Advertisement -

అయితే ఆయన కాంగ్రెస్ ను ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టె ప్రసక్తే లేదని, తాను కరుడుగట్టిన కాంగ్రెస్ వాదినని వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆయన తాజాగా అమిత్ షాను కలవడంతో.. వెంకట్ రెడ్డి పార్టీ మారడంపై వార్తలు తగ్గడంలేదు. ఇక మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ ను వీడేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారట. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి పోటీగా బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రేస్ లో నిలవాలంటే.. కీలక నేతలను పార్టీ మారకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read

బండి సంజయ్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడా ?

ఈటెల కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏంటి ?

మోడీ అమిత్ షా మాస్టర్ ప్లాన్ .. ఆ రాష్ట్రంపై !

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -