బండి సంజయ్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడా ?

- Advertisement -

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరగనుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు పక్కా ప్రణాళికలతో వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది..దాంతో టి‌ఆర్‌ఎస్ ఇరుకున పడేలా మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు కమలనాథులు. ఇప్పటికే తెలంగాణలో ఊహించని రీతిలో బలం పెంచుకుంటున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ కు బలమైన ప్రత్యర్థిగా బీజేపీ ఉండనుందనే సంకేతాలను పంపిస్తోంది.

ఇప్పటికే జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలతో పాటు జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో కూడా టి‌ఆర్‌ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది బీజేపీ. టి‌ఎస్ లో బలపడుతున్న బిజెపికి మరింత బలం పోసేందుకు ” ఆపరేషన్ ఆకర్ష్ ” మొదలు పెట్టిన బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఇతర పార్టీలలోని కీలక నేతలను బిజేపిలో కలిపేసుకుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం పోటీ పడుతున్న పార్టీలలో బిజెపితో పాటు కాంగ్రెస్ కూడా రేస్ లో ఉన్నప్పటికి..బీజేపీ ఫోకస్ మాత్రం టి‌ఆర్‌ఎస్ పైనే ఉంది. ఆ పార్టీని దెబ్బ తీసే ఏ చిన్న అవకాశం కూడా వదలడం లేదు కమలనాథులు. టి‌ఆర్‌ఎస్ లోని ఎమ్మెల్యేలను, నేతలను ఆకర్షించే విధంగా బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్ ఈటెల రాజేందర్ అస్త్రశాస్త్రాలు రచిస్తున్నారు.

- Advertisement -

రాబోయే రోజుల్లో ఊహించని రీతిలో బీజేపీలోకి చేరికలు ఉండబోతున్నాయని ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో కాక పెంచుతున్నాయి. ఇక టి‌ఎస్ బీజేపీ బాస్ బండి సంజయ్ కూడా టి‌ఆర్‌ఎస్ నుంచి 12 మంది ఎమ్మేల్యేలు, నేతలు బీజేపీలో చేరబోతున్నారు అని బాంబ్ పేల్చాడు. ఒకవేళ ఇదే గనుక జరిగితే.. టి‌ఆర్‌ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లేనని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా కూడా టి‌ఆర్‌ఎస్ మనోదైర్యాన్ని దెబ్బతీసే విధంగా కమలనాథులు చేస్తోన్న మైండ్ గేమ్ అయిఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మైండ్ గేమ్ ద్వారా టి‌ఆర్‌ఎస్ బలహీన పడుతోందనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపించాలని బండి సంజయ్ అండ్ కో గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరి కమలనాథులు చేస్తున్న ఈ మైండ్ గేమ్ కి టి‌ఆర్‌ఎస్ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి.

Also Read

కాంగ్రెస్ కు మునుగోడు అగ్నిపరీక్ష !

బాబు తెలంగాణ వైపు చూస్తున్నారా ?

కేజృవాల్ క్రేజీ ఆఫర్స్.. మోడీకి చెక్ పెడతాడా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -