Wednesday, April 24, 2024
- Advertisement -

తెరపైకి పొలిటికల్ క్లియరెన్స్ అంశం

- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విదేశీ పర్యటన వివాదానికి కేంద్ర బిందువైంది. విదేశాల్లో పర్యటనకు వెళ్లే ప్రతి పార్లమెంట్ సభ్యుడు ప్రభుత్వం నుంచి విధిగా పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నిబంధనను రాహుల్ పాటించలేదంటున్నాయి. లండన్ వెళ్లే ముందు రాహుల్ పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోకపోవడం దుమారం రేపుతోంది.

ఎంపీల పర్యటనలకు సంబంధించి భారత విదేశీ వ్యవహారాల శాఖ పొలిటికల్ క్లియరెన్స్ ఇస్తుంది. ఎవరైనా ఎంపీలకు విదేశాల నుంచి ఆహ్వానం కూడా విదేశాంగ శాఖ ద్వారానే రావాలి. పర్యటనకు మూడు వారాల ముందే విదేశీ వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ రాహుల్ అలా చేయలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ప్రైవేటు కార్యక్రమాలకు పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాల్సి అవసరం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. కేవలం అధికారిక కార్యక్రమాలకే ఇది వర్తిస్తుందని చెబుతోంది. మొత్తమ్మీద ఈ వ్యవహారం మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోంది.

దావోస్‌లో బిజీబిజీగా జగన్

గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

ఆస్కార్ కీలక నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -