Friday, March 29, 2024
- Advertisement -

సొంత చెల్లెలితో ఆస్తి గొడ‌వ‌, వారి‌తోనూ విభేదాలు!

- Advertisement -

క‌ర్నూలు: జిల్లాలో సుమారు 30 ఏళ్లుగా భూమా కుటుంబం చ‌క్రం తిప్పింది. 1989లో ఆళ్ల‌గ‌డ్డ నుంచి భూమా శేఖ‌ర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి మొద‌లైన ప్ర‌స్థానం 2014 వ‌ర‌కు అప్రతిహ‌తంగా కొన‌సాగింది. ఈ మ‌ధ్య కాలంలో కేవ‌లం ఒకే ఒక్క‌సారి ఆ ఫ్యామిలీకి ఓట‌మికి ఎదురైంది. ఇక టీడీపీతో పొలిటిక‌ల్ లైఫ్ మొద‌లుపెట్టిన భూమా కుటుంబం ప్ర‌జారాజ్యం, ఆ త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో శోభా నాగిరెడ్డి ప్ర‌మాదంలో మృతి చెంద‌డంతో ఆమె స్థానంలో అఖిల ప్రియ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. కానీ పార్టీలో త‌మ‌కు ప్రాధాన్య‌త‌నిచ్చిన వైఎస్ జ‌గ‌న్‌ను కాద‌ని, తండ్రి నాగిరెడ్డితో స‌హా తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి ప‌ద‌వి ఆశించిన నాగిరెడ్డికి చంద్ర‌బాబు మొండిచేయ చూప‌డం వంటి ప‌రిణామాల క్ర‌మంలో గుండెపోటుతో ఆయ‌న మ‌ర‌ణించారు. ఇక అప్ప‌టి నుంచి వ్య‌వ‌హారం అంతా నాగిరెడ్డి దంప‌తుల పెద్ద కూతురు అఖిల ప్రియ చేతుల్లోకి వ‌చ్చింది.

ఆది నుంచీ వివాదా‌స్ప‌ద‌మే..
తండ్రి మ‌ర‌ణంతో అఖిల ప్రియ‌కు టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రిగా అవ‌కాశం వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అంత‌గా ప్రాధాన్యం లేని ప్రాధాన్యత లేని పర్యాటకశాఖ అమాత్యురాలైన‌ప్ప‌టికీ అఖిల ప్రియ త‌న పొలిటిక‌ల్ ప‌వ‌ర్‌ను ఉప‌యోగించి ప‌లు దందాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ముఖ్యంగా భార్గ‌వ్‌రామ్(ఇద్ద‌రికీ రెండో పెళ్లి)‌తో వివాహమైన త‌ర్వాత అత‌డి ప్రోద్భ‌లంతో ఆమె అవినీతి కార్య‌క‌లాపాలు శ్రుతిమించాయ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఇత‌రుల‌నే గాకుండా సొంత కుటుంబ స‌భ్యులు, త‌న తండ్రికి స‌న్నిహితంగా మెలిగిన వాళ్ల‌ను కూడా ఆమె ఇబ్బంది పెట్టార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌మ బంధువు శివరామిరెడ్డిని బెదిరించ‌డం స‌హా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణరెడ్డికి వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు చేయ‌డం, స‌హా త‌న పెద్దనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో విభేదాలు వంటి ప‌రిణామాల‌తో బంధువులతో అఖిల ప్రియ‌కు దూరం పెరిగింద‌ని స్థానికులు బాహాటంగానే చ‌ర్చించుకుంటున్నారు.

అంతేగాక అఖిల ప్రియ దుందుడుకు వైఖ‌రితో ఆళ్లగడ్డ, నంద్యాలలోని ‘భూమా’ వర్గం కూడా రాజకీయంగా ప్రత్యామ్నాయాలను వెదుక్కోవ‌డం మొద‌లుపెట్టారు. దీంతో 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమెకు ప‌రాజ‌యం ఎదురైంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆళ్లగడ్డకు అఖిల వచ్చినా ఆమెతో మాట్లాడేందుకు ప‌ట్టుమ‌ని పదిమంది కూడా ఇంటికి రావడం లేదంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో ఆమె ఎక్కువగా హైదరాబాద్‌లోనే స‌మ‌యం గడుపుతున్నారు.

ఇలాంటి త‌రుణంలో హ‌ఫీజ్‌పేట‌లోని భూ వ్య‌వ‌హారంలో త‌ల‌దూర్చిన అఖిల ప్రియ ఏకంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్‌న‌కు స్కెచ్‌వేసి పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయారు. అరెస్టై చంచ‌తల్‌గూడ జైళ్లో ఊచ‌లు లెక్క‌పెడుతున్నారు. ఇక ఆమె భ‌ర్త అయితే ఇంకా పోలీసుల‌కు చిక్క‌కుండా ప‌రారీలోనే ఉన్నారు. అయితే హ‌డావుడిగా అక్ర‌మ ప‌ద్ధ‌తిలో త‌‌మ‌ను పార్టీలో చేరుకున్న చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌లు ఎవ‌రూ క‌నీసం ఈ విష‌యంపై స్పందించేందుకు ముందుకు రావ‌డం లేదు. దీంతో అఖిల ప్రియ రాజకీయ భ‌విష్య‌త్తు ఏమికానుందో అన్న అంశం జిల్లా పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సొంత చెల్లెలిని సైతం
‌రోవైపు త‌న అక్క అరెస్టుతో ఆమెకు మ‌ద్ద‌తుగా భూమా మౌనిక మీడియా ముందుకు వ‌చ్చిన‌ప్ప‌టికీ వారిద్ద‌రి మ‌ధ్య ఆస్తి త‌గాదాలు ఉన్న విష‌యం బ‌య‌టికి పొక్కింది. తండ్రికి సంబంధించిన ఆల్ఫా ఇంజ‌నీరింగ్ కాలేజీ ప్రాప‌ర్టీ అమ్మ‌కం విష‌య‌మై ఇద్ద‌రి మ‌ధ్య‌ గొడ‌వ జ‌రిగిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. కాలేజీకి చెందిన మూడు ఎక‌రాల భూమిని … ఎక‌రా రూ.50 ల‌క్ష‌ల చొప్పున విక్ర‌యించార‌ని తెలిసింది. అయితే ఇందులో మౌనిక వాటా కింద డ‌బ్బును అఖిల ‌ప్రియ ఇవ్వ లేద‌ని తెలుస్తోంది. దీంతో ఆమె ఆళ్ల‌గ‌డ్డ వెళ్లి గొడ‌వ‌ చేసినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని స్థానికుల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

సోద‌రుడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి కూడా ఈ విష‌యంలో మౌనంగా ఉండ‌టంతో భూమా నాగిరెడ్డి ఆస్తుల విష‌య‌మై మౌనిక కోర్టుకెక్కాల‌ని భావిస్తున్న‌ట్టు సమాచారం. చ‌ట్ట‌బ‌ద్ధంగానే త‌న‌కు రావాల్సిన ఆస్తిని ద‌క్కించుకోవ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. దీంతో అఖిల ప్రియ సొంత చెల్లెలిని సైతం ఇబ్బందుల‌ను గురిచేసింద‌ని, ఆమెకు ఇత‌రులు ఒక లెక్కా , ఆమె వ‌ల్ల భూమా కుటుంబ ప్ర‌తిష్ట ఏం కావాలి అంటూ చ‌ర్చించుకుంటున్నారు.

అఖిలప్రియ అరెస్టు ఏపీలో అయితే… వేరేలా ఉండేది…

కేసీఆర్‌కు హెల్త్‌ చెకప్‌, నెక్ట్స్‌ సీఎం ఆయనేనా?

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -