Saturday, April 20, 2024
- Advertisement -

క‌ర్నూలు జిల్లాలో కాల్పుల క‌ల‌క‌లం…వేడెక్కిన రాజ‌కీయం

- Advertisement -

ఎన్నిక‌ల వేల ప‌ర‌స్ప‌ర దాడుల‌తో క‌ర్నూలు రాజ‌కీయాలు వేడెక్కాయి. ప‌లు చోట్ల హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. తాజాగా జిల్లా మంత్రాల‌యం మండ‌లం ఖగ్గల్‌లో తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వైసీపీ, టీడీపీ ప‌ర‌స్ప‌ర దాడుల‌తో ఆప్రాంతం అట్టుడికింది. బాలానాగిరెడ్డి స్వగ్రామం ఖగ్గల్‌లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పార్టీ జెండాను అవిష్క‌రించ‌డంతో గొడ‌వ మొద‌ల‌య్యింది. ఎన్నిక‌ల కోడ్ ఉన్నందున ఎలా పార్టీ జెండాను ఆవిష్క‌రిస్తార‌ని వైసీపీనేత‌లు అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అంతేకాదు ఎమ్మెల్యే బాలానాగిరెడ్డి వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై దాడిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తిక్కారెడ్డి గన్‌మెన్ కాల్పులు జరిపినట్లు స‌మాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తిక్కారెడ్డి గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ప్ర‌మాద‌వ‌శాత్తు తిక్కారెడ్డితో పాటు మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్‌కు గాయాలయ్యాయి. వారిని ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పరస్పరం హత్యారోపణలతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -