టిఆర్ఎస్ కు ఫ్యూచ‌ర్ క‌నిపిస్తుందా..

- Advertisement -

తెలంగాణాలో రాజ‌కీయాలు మారిపోతున్నాయి. ఒక‌ప్ప‌టి మోనోప‌లి పాలిటిక్స్ ఇప్పుడు కుద‌ర‌డం లేదు. ప‌చ్చిగా చెప్పాలంటే ఒక్కొక్క‌రికి సొమ్ము సుర్రు అయిపోతుంది. దుబ్బాక ఎన్నిక‌ల‌తో షురూ అయిన ర‌చ్చ రంబోలా..జిహెమ్ ఎంసి ఎల‌క్ష‌న్స్ తో పీక్స్ కు వెళ్లింది. రెండుచోట్ల బిజేపీ రావ‌డంతో కేసీఆర్ కు ఏం అర్ధం కాలేదు. ఈరెండుచోట్ల‌ టిఆర్ ఎస్ ఓట్లే బిజేపీకి వెళ్లాయి త‌ప్ప‌..కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను బిజేపి సొంతం చేసుకుంది ఏం లేదు. ఆమాట‌కొస్తే కాంగ్రెస్ కు తెలంగాణాలో ఒక‌ప్ప‌టి ట్రెడిష‌న‌ల్ ఓట్ బ్యాంక్ క‌నిపించ‌డ‌మే లేదు.

తాజాగా హుజూరాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తుంటే…రాజ‌కీయ పండితుల‌కు తెలంగాణాలో ఓట‌ర్లు బీజేపికి స్పేస్ ఇస్తున్నార‌నే విష‌యం అర్ధ‌మ‌వుతుంది.కాక‌పోతే వ‌చ్చే ఆ స్పేస్ కూడా లీడ‌ర్ల‌ను చూసి వ‌స్తుందే. రానున్న రోజుల్లో హూజూరాబాద్ ఫ‌లితం… బిజేపీకి ఎంతోమంది టిఆర్ ఎస్ రెబ‌ల్స్ తో పాటు కాంగ్రెస్ నాయ‌కుల‌ను క్యూ క‌ట్టేలా చేస్తుంది.

- Advertisement -

ఒక‌వేల వ‌చ్చే ఎన్నిక‌ల‌కు బిజేపి సెంట‌ర్లో మ‌రిన్ని బిల్స్ పాస్ చేస్తే ..ఆ పాస్ అయిన బిల్లులు పేద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేవి అయితే క‌శ్చితంగా పొలిటిక‌ల్ ఈక్వేష‌న్స్ మారిపోవ‌చ్చు. ఆల్ రెడీ రెండు ద‌ఫాలుగా కేసిఆర్ పాల‌ను చూసిన టిఓట‌ర్లు ..ఓక‌వేల మార్పుకోరుకుంటే ..ఆ ప్లేస్ బిజేపీకే ద‌క్కేలా ఉంది. మ‌రి కేసీఆర్ త‌న రాజ‌కీయ‌చ‌తుర‌త‌తో విష‌యాన్ని అక్క‌డ‌వ‌ర‌కు రాణిస్తాడా లేక కొడుకును సిఎంను చేయాల‌నే మాయ‌లో ప‌డి చివ‌ర‌కు చేతులెత్తేస్తాడో తెలియ‌దు. ఏది ఏమైనా కాల‌మే స‌మాధానం చెప్పాలి.

వైసీపీ పై ఫైర్ అయిన జనసేనాని

ఇదిగో టీడీపీ నిజస్వరూపం…!

డ్రాగన్ ఫ్రూట్ తో ఇన్ని లాభాలా?

మధ్యాహ్నం పడుకుంటున్నారా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -