Friday, April 19, 2024
- Advertisement -

వైసీపీ పై ఫైర్ అయిన జనసేనాని

- Advertisement -

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ విశాఖ ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటి చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఆంధ్రుడికి ఉందన్నారు. విశాఖ కార్మాగారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేఖంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడంలేదన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఏపీ ప్రభత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. అసెంబ్లీలో తీర్మాణం చేసి చేతులు దులుపుకుంటే కుదరదన్నారు. ఢిల్లీ వీధుల్లో గలం వినిపించకుంటే.. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి లాభమేంటని పవన్ ప్రశ్నించారు. ఉక్కు కార్మగారం విషయంలో ప్రభుత్వ కల్లబొల్లు కబుర్లు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని పవన్ వ్యాఖ్యానించారు. నష్టాల పేరుతో పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలనుకోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేఖంగా జగన్ ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. రాష్ట్ర బాగుకోసం పార్లమెంట్‌లో గలం విప్పని వైసీపీ ఎంపీలు కాఫీలు, టిఫిన్‌లు చేయడానికి పార్లమెంట్‌కు వెళ్తున్నారా ? అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు లేని తమ వినతులను కేంద్రం పట్టించుకునే ప్రభుత్వం.. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ అభ్యర్థనను పట్టించుకోవడం లేదా ? అని ప్రశ్నించారు. పదవులకు, బేయిల్‌ కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం వైసీపీ మాట వింటుందా అన్నారు. వైసీపీ మీద నమ్మకం లేదన్న జనసేనాని.. జగన్ వారంరోజుల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చెయాలని ఢిమాండ్ చేశారు.

ఇదిగో టీడీపీ నిజస్వరూపం…!

Photos: వైఎస్ షర్మిల 12వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్ర

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -