Thursday, May 2, 2024
- Advertisement -

బీసీలను వాడుకుంది బాబు… ఆదుకుంది జగన్

- Advertisement -

చంద్రబాబుది అవసరం ఉంటే ఒడమల్లయ్య.. లేకుంటే బోడి మల్లయ్య అనే టైప్ … ఎన్నికలు రాగానే బీసీలు.. ఎస్సిలు… ఎస్టీలు అని చెబుతాడు.. ఎన్నికలు కాగానే పదవులు.. పోస్టింగులు అన్నీ తమ కులాలవాళ్ళకు లేదా తమకు ఆర్థికంగా అండదండలు ఇచ్చినవాళ్లకు మాత్రమే ఇచ్చుకుంటారు… ఇది ఒకసారి కాదు… చంద్రబాబు పదే పదే చెప్పేది అదే… చేసేది కూడా ఇదే.. ఒకసారి బీసీలకు ఎవరు ఎంత మద్దతుగా నిలిచారో చూద్దాం.

బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసిన నాటి సీఎం చంద్రబాబు

నాయీబ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తా,మత్స్యకారులకు తోలు తీస్తానని కాసురుకున్నది కూడా బాబే

ఇక సీఎం వైయస్ జగన్ అయితే స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 34 శాతం పదవులు కేటాయిస్తూ 2019 డిసెంబరు 28న జీఓ జారీ చేసి వారికి పదవుల్లో చట్టబద్ధమైన వాటా ఇచ్చారు.

దీన్ని వ్యతిరేకిస్తూ బాబు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టుకు వెళ్లిన టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి

వాస్తవానికి 2019 మార్చి తొమ్మిదిన చంద్ర బాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు తీరు పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్‌(ఏపీఎస్‌ఈజీసీ) సభ్యుడిగా బిర్రు ప్రతాప్ రెడ్డి ని నియమించింది

ఈ కేసు దెబ్బతో జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీఓను నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు .. దీంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికే పరిమితం


బీసీలకు జగన్ ఏమి చేశారు ?

బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు… బీసీలంటే దేశానికి బ్యాక్‌ బోన్‌ అని ప్రకటించారు

డీబీటీ (నగదు బదిలీ) ద్వారా రూ.1.15 లక్షల కోట్లు బీసీల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
నగదేతర బదిలీ ద్వారా రూ.50,321.88 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.1.65 లక్షల కోట్ల మేర బీసీలకు ప్రయోజనం చేకూర్చారు.

కీలక పదవుల్లో బీసీలు

జగన్‌ ప్రభుత్వంలో బీసీ మంత్రులు–11
(బాబు హయాంలో–8)

జగన్‌ ప్రభుత్వంలో రాజ్యసభ సీట్లు–4
(బాబు హయాంలో గత 5 ఏళ్లలో–0)

జగన్‌ ప్రభుత్వంలో–స్పీకర్ తమ్మినేని సీతారాం(బీసీ)
బాబు హయాంలో –కోడెల(చౌదరి)

•ఎమ్మెల్యేలు–౩౧
•ఎమ్మెల్సీలు–19
•కార్పొరేషన్లు–56
•మేయర్‌ పదవులు–9
•మున్సిపల్‌ చైర్మన్లు–98
•జడ్పీ చైర్మన్లు–9
•జడ్పీటీసీలు–215

ఇది కాకుండా టీడీపీ నుంచి గత ఎన్డీయే హయాంలో వచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులు (అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి ) బీసీలు కారు. ఇక సుజనా చౌదరి అయితే బ్యాంకులకు 6 వేల కోట్లు ఎగ్గొట్టిన వ్యక్తి. ఇది చంద్రబాబు నిజస్వరూపం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -