చంద్ర‌బాబుపై జ‌న‌సేనుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబుపై జ‌న‌సేనుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాల్లోని ప్రజలకే న్యాయం చేయలేదని… అలాంటప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు ప‌వ‌న్‌. చిత్తూరులోని హైరోడ్డు విస్తరణలో భవననాలను కోల్పోయిన బాధితులకు అండ‌గా ఉంటామ‌న్నారు.

విదేశాలు నుంచి వచ్చే వారికి వేల ఎకరాలు ఇస్తున్నారని, సొంత జిల్లా వాసులకు న్యాయం చేయలేరా అంటూ చంద్రబాబును పవన్ ప్రశ్నించారు. నంద్యాల, విజయనగరం, శ్రీకాళహస్తిలో ఇచ్చిన నష్ట పరిహారం చిత్తూరులో ఎందుకు ఇవ్వడం లేదని పవన్ సర్కారును నిలదీశారు. అనంతరం ఆయన బాధితులతో కలసి దుర్గానగర్ నుంచి గాంధీ రోడ్ వరకు పాదయాత్ర చేపట్టారు.

చిత్తూరు జిల్లాలో రెండు రోజులుగా పర్యటిస్తున్నపవన్ కళ్యాణ్‌ మంగళవారం శ్రీకాళహస్తీశ్వరుడి దర్శించుకున్నారు. ఆలయం తరపున ఈవో భ్రమరాంబ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని సర్వదర్శన క్యూలైన్‌లో వెళ్ళి జ్ఞాన ప్రసున్నాంబ సమేత శ్రీవాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు పవన్‌కు తీర్ధప్రసాదాలు అందజేశారు.