Wednesday, April 24, 2024
- Advertisement -

తమిళనాట ఎన్నికలలో ప్రధాన పార్టీ సీఎం అభ్యర్థి ఖరారు..!

- Advertisement -

తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సీఎం అభ్యర్థిగా కే పళనిస్వామిని ఎన్నుకుంది అన్నాడీఎంకే. ఆయన నామినేషన్​ను పార్టీ జనరల్ కౌన్సిల్​ ధ్రువీకరించింది. ఎన్నికల పొత్తులపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పళనిస్వామితో పాటు డిప్యూటీ సీఎం పనీర్​సెల్వంకు కట్టబెడుతూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. సీట్ల పంపిణీ, ఎన్నికల వ్యూహాల విషయంలోనూ వీరిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.

2020 అక్టోబర్​లో ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల స్టీరింగ్ కమిటీని సైతం జనరల్ కౌన్సిల్ ధ్రువీకరించింది. సీఎం పళనిస్వామిపై డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన విమర్శలను ఖండిస్తూ తీర్మానాన్ని విడుదల చేసింది.చెన్నై సమీపంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది అన్నాడీఎంకే. సమావేశానికి పార్టీ ప్రెసిడియం ఛైర్మన్ ఈ మధుసూధనన్ అధ్యక్షత వహించారు.

సీఎం అభ్యర్థి పేరును ఎన్​డీఏ అధిష్ఠానం నిర్ణయిస్తుందని బీజేపి నేతలు చెబుతున్న నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, తమిళనాడులో ఎన్​డీఏ కూటమిని అన్నాడీఎంకే పార్టీనే నడిపిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -