Saturday, April 20, 2024
- Advertisement -

బాబు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా గెలుపు కోసం వైకాపాలోకే అంటున్న ఆమంచి, మాగుంట

- Advertisement -

టిడిపి అధినేత చంద్రబాబు, టిడిపి భవిష్యనేతగా ప్రచారం చేయించుకుంటున్న లోకేష్‌లు 2019ఎన్నికల్లో టిడిపి క్లీన్ స్వీప్ చేస్తుంది అన్న స్థాయిలో మాటలు చెప్తున్నారు. కానీ ఎన్నికల ఏడాదిలో నాయకుల చేరికల వ్యవహారం చూస్తుంటే టిడిపికి కనీసం ప్రతిపక్ష స్థానానికి అవసరమైనన్ని సీట్లయినా వస్తాయా అన్న అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయి సర్వేలు కూడా దాదాపు పది శాతం ఓట్లే తేడాతో వైకాపా గెలుపు ఖాయం అని చెప్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా చంద్రబాబుకంటే జగన్‌కే దాదాపు పదిశాతం మంది కంటే ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేస్తున్నారు.

పార్టీలలోకి నాయకుల చేరికలను ప్రామాణికంగా తీసుకున్నా కూడా వైకాపా గెలుపు పట్ల ఎక్కువ మంది నాయకులు విశ్వాసంతో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఒంగోలు మాజీ ఎంపి, ప్రస్తుత టిడిపి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డిలు వైకాపాలో చేరాలని దాదాపు నిర్ణయించుకున్నారు. 2014ఎన్నికల్లో ఒంగోలు నుంచి టిడిపి ఎంపి అభ్యర్థిగా పోటీచేసి వైకాపా అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయాడు మాగుంట. అయినప్పటికీ చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చేలా చేశాడు. ఇప్పుడు కూడా 2019 ఎన్నికల్లో సీటు గ్యారెంటీ అని మాగుంటతో చంద్రబాబు చెప్తున్నాడు. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశమేలేని టిడిపికంటే వైకాపాలో చేరడం బెటర్ అని మాగుంట నిర్ణయించుకున్నాడు. ఇక చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా టిడిపిని వదిలి వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నాడు. మాగుంట, ఆమంచిల అభిమానులు, అనుచరులందరూ కూడా వైకాపాలో చేరమని ఒత్తిడి చేయడం కూడా ఈ చేరికలకు కారణం అవుతోంది. వైకాపాలో చేరితే గెలుపు ఖాయం అని టిడిపిని నమ్ముకుంటే నిండా మునగడం ఖాయమని మాగుంట, ఆమంచి వర్గాల ముఖ్యనాయకులు మీడియా ముఖంగానే ప్రకటనలు చేస్తుండడం పరిస్థితికి అర్థం పడుతుంది. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే వైకాపా పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులున్నాయి. ఇక ఈ ఇద్దరు నాయకులు కూడా చేరితే ఒంగోలు ఎంపి నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కనీసం పోటీనిచ్చే స్థాయి అభ్యర్థిని వెతకడం కూడా చంద్రబాబుకు చాలా కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం పరిస్థితులను చూస్తుంటే 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా ఫలితాలు మాత్రం పూర్తిగా వైకాపాకు అనుకూలంగా ఉండడం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -