Tuesday, May 14, 2024
- Advertisement -

ఇదంతా వైసీపీ కుట్రే..

- Advertisement -

నంద్యాల‌లో జ‌రిగిన వైసీపీ శిల్పా, టీడీపీ అభిరుచి మ‌ధు మ‌ద్య జ‌రినిన కాల్పుల సంఘ‌ట‌న రాష్ట్రం వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఇదే ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. ప‌ట్ట‌ప‌గ‌లే టీడీపీ నేత వేట కొడ‌వ‌లితో ఎంత‌టి వీరంగం సృష్టించారో తెలిసిందే. అయితే ధీనిపై మంత్రి అఖిల ప్రియ స్పందించిన తీరు ఆమోఘ‌మ‌నే చెప్పాలి.

ఇదంతా వైసీపీ కుట్రేన‌ని … అఖిల సెల‌విచ్చారు. వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డిని బెదిరించేందుకు గాలిలోకి కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. చక్రపాణి మాట్లాడుతూ, తనపై హత్యాయత్నం జరిగిందని చెబుతూనే మధు ప్రస్తుతం మంత్రి అఖిలప్రియకు సన్నిహితంగా మెలుగుతున్నట్లు ఆరోపించారు.

ఓటమిభయంతోనే వైసీపీ నేతలు కుట్ర పన్నినట్లు ఆరోపించటం గమనార్హం. మధు తదితరులు, చక్రపాణి మనుషులు ఎదురుపడినపుడు చక్రపాణి మద్దతుదారులు రాళ్ళు రువ్వటంతోనే ఘర్షణ మొదలైందన్నారు. కేవలం ఆత్మరక్షణ కోసమే మధు గన్ మెన్ గాలిలోకి 5 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా అఖిల వివరించారు. టిడిపి కార్యకర్తలు ఎవరు కూడా అదైర్యపడొద్దని కూడా మంత్రి ధైర్యం చెప్పారు.

భిరుచి మధునే చక్రపాణిరెడ్డిపై దాడికి ప్రయత్నించినట్లు విజువ‌ల్స్‌లో స్పష్టంగా తెలుస్తోంది. జరిగిన ఘటనను పలువురు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. దాంతో దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యల ప్రకారం మధునే చక్రపాణిరెడ్డిని కత్తితో బెదిరిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. ‘నీ అంతు చూడాలనే వచ్చాను’ అంటూ అరవటం కూడా వినిపించింది. అంటే అర్ధమేంటి? వ్యూహం ప్రకారమే మధు తన అనుచరులతో తుపాకి, కత్తులను తీసుకు వచ్చినట్లు అర్దమవుతోంది.

అయితే మంత్రి మాత్రం మ‌ధు ఒట్టి అమాయ‌కుడ‌ని బిల్డ‌ప్ ఇస్తున్నారు. అక్క‌డ జ‌రిగిన సంఘ‌ట‌న‌కు..మంత్రిగారి వ్యాఖ్య‌లు భిన్నంగా ఉన్నాయి. ఓట‌మి బ‌యంతో వైసీపీ కుట్ర చేస్తోంద‌ని ఆరోపించ‌డంలో అర్థంలేదు. పోలింగ్ అయిపోయింది. ఫ‌లితాల‌కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -