Wednesday, April 24, 2024
- Advertisement -

రెడీ అంటున్న కే‌సి‌ఆర్ .. వద్దంటున్న కే‌టి‌ఆర్ ?

- Advertisement -

తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య రాజకీయ వేడి పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఇరు పక్షాల వారు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టి‌ఆర్‌ఎస్ పార్టీని ఎలాగైనా గద్దె దించే పనిలో విపక్షాలు తమమునకలై వున్నాయి. ముఖ్యంగా టి‌ఆర్‌ఎస్ ను ఇరకాటంలో పెట్టడంలో బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ కొంత మేర సక్సస్ సాధిస్తోంది. ఇటీవల బీజేపీ నేతలు హైదరబాద్ లో నిర్వహించిన కార్యవర్గ సమావేశాలు సక్సస్ కావడంతో కమలనాథుల్లో రెట్టింపు ఉత్సాహం ఏర్పడింది. ఇక బీజేపీ ఉత్సాహానికి ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు టి‌ఆర్‌ఎస్ పార్టీ కూడా గట్టిగానే వ్యూహాలు రచిస్తోంది.

విపక్షలను ఇరకాటంలో పెట్టేందుకు ఇటీవల కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్దమని, దమ్ముంటే ఎన్నికలకు సిద్దం కావాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. అంతే కాకుండా ఎన్నికలకు సిద్దమనే సవాల్ స్వీకరిస్తే అసెంబ్లీ రద్దు చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. అయితే కమలనాథులు కూడా ఈ సవాల్ ను స్వీకరిస్తూ ఎన్నికలకు తాము కూడా సిద్దమని కౌంటర్ వేశారు. దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం పక్కా అని భావించారంతా. కానీ రాజకీయ నాయకులు చెప్పిన మాటపై నిలబడే అవకాశాలు చాలా తక్కువ. కానీ కే‌సి‌ఆర్ గత ఎన్నికల సమయంలో కూడా ముందస్తు ఎన్నికలు నిర్వహించి విజయం సాధించారు. ఆవిధంగా ఈ ఏడాది కూడా ముందస్తు ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదనే వాదనలు కూడా వినిపించాయి.

అయితే ఇటీవల కే‌టి‌ఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తూ ముందస్తు ఎన్నికల విషయంలో కే‌సి‌ఆర్ వెనక్కి తగినట్లు తెలుస్తోంది. మంత్రి కే‌టి‌ఆర్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. అసెంబ్లీ ఎన్నికలు పక్కా షెడ్యూల్ ప్రకారమే 2023 జరుగుతాయని స్పష్టం చేశారు. తాము ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పుకొచ్చారు. దాంతో టి‌ఆర్‌ఎస్ రాబోయే ఎన్నికల్లో గెలుపుపై కాస్త వెనకడుగు వెస్తోన్నట్లు తెలుస్తోంది.. అయితే కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్దమని చెప్పడం, కే‌టి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో టి‌ఆర్‌ఎస్ పార్టీ భయపడుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరి దీనిపై టి‌ఆర్‌ఎస్ ఎలా స్పందిస్తోందో చూడాలి.

ఇవి కూడా చదవండి

అప్పుల్లో తగ్గేదెలే.. అంటున్న జగన్ సర్కార్ !

సర్వే ఫలితాలు ఎవరికి లాభం ?

పవన్.. ఇలా అయితే కష్టమే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -