Friday, May 3, 2024
- Advertisement -

తర్వాత టార్గెట్ ఎవరనే భయంతో వణుకు

- Advertisement -

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు షాకింగ్ విషయాలు బయట పెట్టారు. కనీసం 200మంది నక్సలైట్ల హిట్ లిస్ట్ లో ఉన్నారని హెచ్చరించారు. వాళ్లందరికీ ప్రాణగండం ఉందని, అప్రమత్తంగా ఉండకపోతే తామేమీ చేయలేమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికలు కొన్నాళ్లుగా పూర్తిగా తగ్గిపోయాయి. ఇక ఇక్కడ నక్సల్స్ లేరు అని భావిస్తున్న సమయంంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా తిరగడం మొదలు పెట్టారు. గన్ మెన్లను పర్సనల్ పనులకు ఉపయోగించుకుంటూ, స్టేటస్ సింబల్ గా భావిస్తూ పలువురు ప్రజాప్రతినిధులు తమ భద్రతకు ఢోకా లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయితే విశాఖ మన్యంలో 60 మందికి పైగా ఆయుధాలు కలిగిన మావోయిస్టులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేయడంతో ప్రజాప్రతినిధులందరి వెన్నులో వణుకు మొదలైంది. దీనికి తోడు దర్యాప్తు బృందాలు నక్సల్స్ హిట్ లిస్ట్ లో 200 మంది ఉన్నారని హెచ్చరించడంతో ఆయా వ్యక్తులు భయంతో గజగజలాడుతున్నారు.

టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు, వైఎస్ఆర్ సీపీ నుంచి టీడీపీకి జంప్ అయిన గిడ్డి ఈశ్వరి, ఆమె పర్సనల్ సెక్రటరీ పోలుపర్తి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, ఆయన సోదరుడు వినాయక్‌, సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నారు. బీజేపీ నాయకుడు లోకుల గాంధీ, కొయ్యూరు మండలం బూదరాళ్ల మాజీ సర్పంచ్‌ సూరిబాబు, ఇదే మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ఎం.ప్రసాద్‌, పెదబయలు మండలాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ, పెదబయలు మండలం జామిగూడ మాజీ సర్పంచ్‌ సుబ్బారావు, ఇంజిరి మాజీ సర్పంచులు సత్యారావు, కామేశ్వరరావుల సహా చింతపల్లి మండలంలో 12 మందిని, జీకే వీధి మండలంలో 10మందితో పాటు మరిందరు మావోయిస్టుల టార్గెట్ అయ్యారని హెచ్చరించారు. వీరితో పాటు పోలీసులు, మాజీ నక్సల్స్, ఇన్ ఫార్మర్లుగా భావిస్తున్న పలువురు సామాన్యులు, వ్యాపారులతో కలిసి దాదాపు 200 మందిని తమ హిట్ లిస్ట్ లో చేర్చారని తెలిసింది. వీళ్లందరికీ ప్రభుత్వం భద్రత కల్పించలేదు కనుక, ఎవరికి వారే వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరించారు. వ్యక్తిగత భద్రత ఏర్పాటు చేసుకోవడంతో పాటు, బయటకు వెళ్లేటప్పుడు తమ మూమెంట్ రిజస్టర్ తమకు ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -