Friday, April 19, 2024
- Advertisement -

నిమ్మగడ్డకు షాక్‌.. లాజిక్‌తో కొట్టిన జగన్‌ సర్కార్‌

- Advertisement -

కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిన తర్వాత ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు జగన్‌ సర్కార్‌ మధ్య చిన్నపాటి మాటల, చేతల యుద్దమే జరుగుతోంది. నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించాలని జగన్‌ ప్రభుత్వం విఫల ప్రయత్నం చేయగా.. కోర్టుకెక్కి నిమ్మగడ్డ తన పదవిని నిలబెట్టుకున్నాడు. ఈ సారి అదే న్యాయస్థానంలో జగన్‌ సర్కార్‌ లాజిక్‌తో నిమ్మగడ్డను ఇరుకునపెట్టింది. ఈ ఏడాది ఆయన నేతృత్వంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నందున ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని హైకోర్టుకు తేల్చి చెప్పింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు‌లో మంగళవారం విచారణ జరిగింది. ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది.
జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కరోనా వాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని, ఈ వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉందని వైసీపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మొదటి డోస్ వేసిన నాలుగు వారాల తర్వాత రెండో డోస్ వేయాలని కేంద్రం సూచించిందని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే వాక్సినేషన్ ప్రక్రియ కూడా నిర్వహించాల్సి ఉందని, ప్రజారోగ్యం దృష్ట్యా వాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాల్సి ఉందని అఫిడవిట్‌లో తెలిపింది.

కాబట్టి ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో అడిషనల్ అఫిడవిట్ తనకు గత రాత్రి అందిందని కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఎస్ఈసీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వచ్చే శుక్రవానికి కేసు విచారణను వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది.

వార్‌ అలా మొదలైంది
ఈ ఏడాది ఎలాగైనా స్ధానిక సంస్ధల ఎన్నికలు జరిగిపోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టింది. ముందుగా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో మొదలైన ఈ ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో టీడీపీ, వైసీపీ మధ్య దాడులు, ప్రతిదాడులు కూడా కొనసాగాయి. ఎన్నికలు వాడీవేడిగా సాగిపోతున్న తరుణంలో అర్ధాంతరంగా ఓ రోజు ప్రెస్‌మీట్‌ పెట్టి కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ చేసిన ప్రకటన సీఎం జగన్‌తో పాటు వైసీపీ ప్రభుత్వానికీ భారీ షాకిచ్చింది.

నిమ్మగడ్డ నిర్ణయంతో షాక్‌ తిన్న సీఎం జగన్‌.. వెంటనే ప్రెస్‌ మీట్‌ పెట్టి ఆయనపై సంచలన విమర్శలు చేశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ ఆయనకు మేలు చేసేందుకే కరోనా పేరుతో స్ధానిక పోరును వాయిదా వేశారంటూ జగన్‌ ఆరోపించారు. అలాగే అతన్ని పదవి నుంచి తొలగించేందుకు సర్కార్‌ విఫల ప్రయత్నం చేయగా.. కోర్టు తీర్పుతో మళ్లీ ఎన్నికల కమిషనర్‌ అయ్యారు. హైకోర్టు ఆదేశాలతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రెడీ అవుతున్నారు. కానీ ఆయన పదవీకాలం మార్చితో ముగియబోతోంది. అప్పటి వరకు ఎన్నికలను వాయిదా వేయాలని జగన్‌ సర్కార్‌ భావిస్తోంది. మరి ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో కాలమే నిర్ణయించాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -